నోటిఫికెషన్స్

రెగ్యులర్‌ ప్రాతిపదికన 80 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 21 Feb 2024 01:26 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌లు

రెగ్యులర్‌ ప్రాతిపదికన 80 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌): 23  
  •  డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌): 51  
  •  మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌): 3
  •  అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (అప్లికేషన్‌ సెక్యూరిటీ): 3

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీతో పాటు పని అనుభవం.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 30 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు; మేనేజర్‌కు 38 ఏళ్లు; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: ముంబయి, నవీ ముంబయి.
వేతన శ్రేణి: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.36,000-63,840; డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,170-69,810; మేనేజర్‌కు రూ.63,840-78,230; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.89,890-1,00,350.
దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌ంగ్‌, ఇంటర్వూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-03-2024.
వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/


భోపాల్‌ స్మారక ఆసుపత్రిలో స్పెషలిస్టులు

భోపాల్‌ స్మారక ఆసుపత్రి, పరిశోధన కేంద్రంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ దరఖాస్తులు కోరుతోంది.

  •  స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3: 11
  •  క్లినికల్‌ సైకాలజిస్ట్‌: 1  

విభాగాలు: మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.
వయసు: స్పెషలిస్ట్‌ పోస్టుకు 40 ఏళ్లు, క్లినికల్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26-03-2024.
వెబ్‌సైట్‌:  https://main.icmr.nic.in/career-opportunity


తిరువనంతపురంలో ప్రాజెక్టు పోస్టులు

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన 9 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో: 3  ( డాక్టోరల్‌ రిసెర్చ్‌ ఫెలో: 1  
  •  జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 3  ( ప్రాజెక్టు అసోసియేట్‌-ఖి: 2

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-03-2024.
వెబ్‌సైట్‌:https://www.iist.ac.in/career/3


వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- 7 పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  •  ల్యాబ్‌ అంటెండెంట్‌: 4  డ్రైవర్‌: 2  
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 1

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ డిప్లొమా.
వయసు: డ్రైవర్‌ ఖాళీలకు 18- 27 ఏళ్లు. మిగిలిన పోస్టులకు 18- 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-03-2024.
వెబ్‌సైట్‌:https://wii.gov.in/staff_recruitment_2024


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు