బీఎస్‌ఎఫ్‌లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఉద్యోగాలు

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్‌-బి, ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌-సి, గ్రూప్‌-సి - ఎయిర్‌ వింగ్‌ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది.

Published : 28 Mar 2024 00:11 IST

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్‌-బి, ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌-సి, గ్రూప్‌-సి - ఎయిర్‌ వింగ్‌ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్ట్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.

ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌-సి కొలువులు

మొత్తం 38 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. వీటిల్లో 2 హెడ్‌ కానిస్టేబుల్‌,  36 కానిస్టేబుల్‌ ఖాళీలు ఉన్నాయి.

1. హెడ్‌ కానిస్టేబుల్‌ (ప్లంబర్‌)-1: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ (ప్లంబర్‌) పాసవ్వాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.  
2. హెడ్‌ కానిస్టేబుల్‌ (కార్పెంటర్‌)-1: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ (కార్పెంటర్‌) ఉత్తీర్ణులవ్వాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.  
3. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌)-13: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ (ఎలక్ట్రీషియన్‌/ వైర్‌మేన్‌/ డీజిల్‌/ మోటర్‌ మెకానిక్‌) పాసవ్వాలి. లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల పని అనుభవం.  
4. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌)-14: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ (డీజిల్‌/ మోటర్‌ మెకానిక్‌) ఉత్తీర్ణులవ్వాలి. లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల పని అనుభవం.  
5. కానిస్టేబుల్‌ (లైన్‌మ్యాన్‌)-9: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ (ఎలక్ట్రికల్‌ వైర్‌మేన్‌/ లైన్‌మేన్‌) పాసవ్వాలి. లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.  
అన్ని పోస్టులకు వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

పరీక్ష ఇలా: దీన్ని పేపర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి.. ప్రశ్నపత్రంలో మూడు భాగాలు ఉంటాయి. వీటికి 100 మార్కులు. వ్యవధి రెండు గంటలు.

  • పార్ట్‌-ఎలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు
  • పార్ట్‌-బిలో జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు
  • పార్ట్‌-సిలో టెక్నికల్‌ సబ్జెక్టులు - 60 ప్రశ్నలు - 60 మార్కులు
  • రాత పరీక్షలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) నిర్వహిస్తారు.

ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌: పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ. ఛాతీ 76 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 81 సెం.మీ.వరకూ పెరగాలి. (20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి 2 సెం.మీ. సడలిస్తారు). ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 46 కిలోల కంటే తక్కువ కాకూడదు.
పీఎస్‌టీలో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. పురుషులు 1.6 కి.మీ. దూరాన్ని 6.5 నిమిషాల్లో పరుగెత్తాలి. 11 అడుగుల లాంగ్‌ జంప్‌కు మూడు అవకాశాలు ఇస్తారు. అలాగే మూడు ప్రయత్నాల్లో మూడున్నర అడుగుల హైజంప్‌ చేయగలగాలి.

  • మహిళలు 800 మీటర్ల పరుగును 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. 9 అడుగుల లాంగ్‌జంప్‌ను, 3 అడుగుల హైజంప్‌ను మూడు ప్రయత్నాల్లో సాధించాలి.  

గ్రూప్‌-సి, ఎయిర్‌ వింగ్‌...

1. అసిస్టెంట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఎస్‌ఐ)-8: సంబంధిత ట్రేడ్‌లో డైరెక్టరేట్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ గుర్తింపుపొందిన మూడేళ్ల డిప్లొమా లేదా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జారీచేసిన గ్రూప్‌ ‘ఎక్స్‌’ డిప్లొమా ఉండాలి. ఏవియేషన్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు.
2. అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఎస్‌ఐ)-11: టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేయాలి. లేదా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జారిచేసిన గ్రూప్‌ ‘ఎక్స్‌’ డిప్లొమా. మెయింటెనెన్స్‌/ నావిగేషన్‌ ఎక్విప్‌మెంట్‌ ఫిట్టింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు.
3. కానిస్టేబుల్‌ (స్టోర్‌మేన్‌)-3: సైన్స్‌ సబ్జెక్టుతో మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టోర్‌ లేదా వేర్‌హౌసింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష: ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. నాలుగు విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒకటి చొప్పున వీటికి వంద మార్కులు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

  • పార్ట్‌-ఎలో జనరల్‌ అవేర్‌నెస్‌ 25, పార్ట్‌-బిలో జనరల్‌ ఇంగ్లిష్‌ 25, పార్ట్‌-సిలో న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 25, పార్ట్‌-డిలో టెక్నికల్‌ సబ్జెక్ట్‌ 25 ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్షలో జనరల్‌/ఓబీసీలు 50 శాతం, ఎస్సీ/ఎస్టీలు 45 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఇలా అర్హులైనవారికి ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ ఉంటాయి.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌: (అసిస్టెంట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెకానిక్‌ - ఏఎస్‌ఐ, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ - ఏఎస్‌ఐ పోస్టులకు): పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 76-80 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ., ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
కానిస్టేబుల్‌ (స్టోర్‌మేన్‌): పురుషుల ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 150 సెం.మీ. అందుకు తగ్గ బరువు ఉండాలి.
ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (అసిస్టెంట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెకానిక్‌ - ఏఎస్‌ఐ, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ - ఏఎస్‌ఐ పోస్టులకు): పురుషులు మైలు దూరం పరుగును 8 నిమిషాల్లో ముగించాలి. 4 అడుగుల 6 అంగుళాల స్టాండింగ్‌ బోర్డ్‌ జంప్‌ చేయాలి. 6 అడుగుల క్లియర్‌ ద డిచ్‌, 7 అడుగుల (ఎక్స్‌క్లూడింగ్‌ 1 ఫీట్‌ రీచ్‌) జంప్‌ అండ్‌ రీచ్‌ ఉంటుంది. మహిళలు మైలు దూరం పరుగును 12 నిమిషాల్లో ముగించాలి. 3 అడుగుల స్టాండింగ్‌ బోర్డ్‌ జంప్‌, 4 అడుగుల క్లియర్‌ ద డిచ్‌ ఉంటుంది. 6 అడుగుల (ఎక్స్‌క్లూడింగ్‌ 1 ఫీట్‌ రీచ్‌) జంప్‌ అండ్‌ రీచ్‌ ఉంటుంది.
కానిస్టేబుల్‌ (స్టోర్‌మేన్‌) పోస్టుకు: పురుషులు 5 కిలోమీటర్ల దూరం 24 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 30 సెకన్లలో చేరుకోవాలి.
వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపి.. విజయవంతమైనవారికి కేటగిరీలవారీగా నియామకాలు చేపడతారు.


ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌-బి...

1. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) -13:  సివిల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేయాలి.
2. జూనియర్‌ ఇంజినీర్‌/ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) - 9: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు: 15.04.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
పరీక్ష : మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. రెండు పేపర్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్‌-1లో.. 100 ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి గంటన్నర. మూడు సెక్షన్లు. సెక్షన్‌-ఎలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25, సెక్షన్‌-బిలో జనరల్‌ అవేర్‌నెస్‌ 25, సెక్షన్‌-సిలో జనరల్‌ ఇంజినీరింగ్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌) 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
పేపర్‌-2: ఎస్‌.ఐ.(వర్క్స్‌): జనరల్‌ ఇంజినీరింగ్‌ (సివిల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు (12 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి).
వ్యవధి రెండు గంటలు. జేఈ/ఎస్‌ఐ (ఎలక్ట్రికల్‌): జనరల్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు (12 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి)

  • ప్రతి పేపర్‌లోనూ జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి.

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆ వివరాలు ఈమెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.
ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ): పురుష అభ్యర్థులు 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 76 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 81 సెం.మీ. వరకూ పెరగాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 46 కేజీల కంటే తక్కువ ఉండకూడదు.
ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ): పురుష అభ్యర్థులు ఏడు నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. మూడు ప్రయత్నాల్లో పదకొండు అడుగుల లాంగ్‌జంప్‌, మూడున్నర అడుగుల హైజంప్‌ చేయాలి. మహిళా అభ్యర్థులు ఐదు నిమిషాల్లో 800 మీటర్ల దూరం పరుగెత్తాలి. ఎనిమిది అడుగుల లాంగ్‌జంప్‌, రెండున్నర అడుగుల హైజంప్‌ మూడు ప్రయత్నాల్లో చేయాలి. మూడో దశలో ప్రాక్టికల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఉంటుంది.


అన్ని పోస్టులకూ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2024
వెబ్‌సైట్‌: rectt.bsf.gov.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని