నోటీస్‌బోర్డు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు

Published : 28 Mar 2024 00:17 IST

అప్రెంటిస్‌

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు

బిలాస్‌పుర్‌ డివిజన్‌లోని సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: కార్పెంటర్‌, సీఓపీఏ, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రికల్‌ (మెకానికల్‌), ఫిట్టర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానికల్‌ (ఆర్‌ఏసీ), ఎస్‌ఎండబ్ల్యూ, స్టెనో (ఇంగ్లిష్‌), స్టెనో (హిందీ), డీజిల్‌ మెకానిక్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మెన్‌, కెమికల్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, డిజిటల్‌ ఫొటోగ్రాఫర్‌.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 24 ఏళ్లకు మించరాదు. ఎంపిక: పది, ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024.
వెబ్‌సైట్‌:https://secr.indianrailways.gov.in/


గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో..

బెంగళూరు, డీఆర్‌డీవో, గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (ఇంజినీరింగ్‌): 75
2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (నాన్‌ ఇంజినీరింగ్‌): 30
3. డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీ: 20
4. ఐటీఐ అప్రెంటిస్‌ ట్రైనీ: 25
విభాగాలు: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌/ ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ టెలికాం ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీకాం, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ. వయసు: 18-37 ఏళ్లకు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 09-04-2024
వెబ్‌సైట్‌:https://www.drdo.gov.in/drdo/


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో రిగ్గర్‌ ట్రైనీ

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అప్రెంటీస్‌ (రిగ్గర్‌ ట్రైనీ): 20 ఖాళీలు

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: మొదటి ఏడాది రూ. 6000. రెండో సంవత్సరం రూ. 7000.
ఎంపిక: ఫిజికల్‌ టెస్టు, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 30-03-2024.
వెబ్‌సైట్‌:https://cochinshipyard.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని