సెయిల్‌లో కొలువులు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు చెందిన బొకారో స్టీల్‌ ప్లాంట్‌.. 108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 02 Apr 2024 03:34 IST

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు చెందిన బొకారో స్టీల్‌ ప్లాంట్‌.. 108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

ప్రకటించినవాటిలో కొన్ని ఉద్యోగాలు బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో.. మరికొన్ని ఝార్ఖండ్‌ మైన్స్‌లో ఉన్నాయి. సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ (ఓహెచ్‌ఎస్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (సేఫ్టీ) మొదలైన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 27. వీటితోపాటుగా 81 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలూ ఉన్నాయి.

1. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)-8: మెట్రిక్యులేషన్‌తోపాటు మూడేళ్ల ఫుల్‌టైమ్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌/ పవన్‌ ప్లాంట్‌/ ప్రొడక్షన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. ఫస్ట్‌ క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 30 ఏళ్లకి మించకూడదు.

2. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)-12: మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ (ఫుల్‌టైమ్‌) పూర్తిచేయాలి. సెకండ్‌క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.

3. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌)-15: మెట్రిక్యులేషన్‌, ఎలక్ట్రికల్‌ డిప్లొమా పాసవ్వాలి.  

4. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (మైనింగ్‌)-5: మెట్రిక్యులేషన్‌తోపాటు మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి.

5. మైనింగ్‌ ఫోర్‌మేన్‌-3: మెట్రిక్యులేషన్‌తోపాటు మైనింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులు కావాలి. మైన్స్‌ ఫోర్‌మేన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  

6. సర్వేయర్‌-1: మెట్రిక్యులేషన్‌, డిప్లొమా ఇన్‌ మైనింగ్‌/ డిప్లొమా ఇన్‌ మైనింగ్‌ అండ్‌ మైన్స్‌ సర్వే పాసవ్వాలి. సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  

7. మైనింగ్‌ మేట్‌-3: మెట్రిక్యులేషన్‌, మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.

8. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ)-34: మెట్రిక్యులేషన్‌, ఐటీఐతోపాటు కనీసం ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌ ఉండి.. ఐరన్‌ ఓర్‌ మైన్‌లో పనిచేసివుండాలి.

  •  డిప్లొమా 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు 40 శాతం సరిపోతుంది.
  •  డిస్టెన్స్‌/ కరస్పాండెన్స్‌/ ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో చదివినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

వయసు: నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్‌ వారికి పదేళ్ల సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్‌ పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., నాన్‌ ఇంజినీరింగ్‌ వారి ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. బరువు 45 కిలోలు, ఛాతీ 72-75 సెం.మీ. ఉండాలి. దృష్టి లోపాలు ఉండకూడదు. మహిళల ఎత్తు 143 సెం.మీ., బరువు 35 కేజీలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు: రూ.700, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం వారికి ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200.  

  •  గ్రేడ్‌ ఎస్‌-3 (ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌, మైనింగ్‌ ఫోర్‌మేన్‌, సర్వేయర్‌) పోస్టులకు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.150.
  •  గ్రేడ్‌ ఎస్‌-1 (మైనింగ్‌ మేట్‌, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌-ట్రెయినీ, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌-బాయిలర్‌) పోస్టులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/                 పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం వారికి రూ.100.

ఎంపిక: ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

  •  ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌), ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ) ఎలక్ట్రికల్‌/ మైనింగ్‌ ఫోర్‌మేన్‌, సర్వేయర్‌ పోస్టులకు: ప్రశ్నపత్రంలో ఆరు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎ: వెర్బల్‌ ఎబిలిటీ, సెక్షన్‌-బి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, సెక్షన్‌-సి: జనరల్‌ నాలెడ్జ్‌, సెక్షన్‌-డి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, సెక్షన్‌-ఇ: డొమైన్‌ నాలెడ్జ్‌ సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్‌/ టెక్నికల్‌ స్ట్రీమ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 90 నిమిషాలు.
  •  మైనింగ్‌మేట్‌, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌), మైనింగ్‌మేట్‌, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ) పోస్టులకు: సెక్షన్‌-ఎ: వెర్బల్‌ ఎబిలిటీ, సెక్షన్‌-బి: జనరల్‌ నాలెడ్జ్‌, సెక్షన్‌-సి: లాజికల్‌ రీజనింగ్‌, సెక్షన్‌-డి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, సెక్షన్‌-ఇ: డొమైన్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 90 నిమిషాలు.
  •  ఒకటికంటే ఎక్కువ పోస్టులకు అర్హతలు ఉన్నట్లయితే.. ఆసక్తి ఉన్నవారు ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు చేయాలి.
  •  దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి. దీన్ని ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ సమయంలో చూపించాలి..
  • స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 16.04.2024
దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2024

వెబ్‌సైట్‌:- www.sail.co.in 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు