నోటీస్‌బోర్డు

ముంబయిలో సైంటిస్ట్‌ పోస్టులు

Updated : 02 Apr 2024 00:36 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ముంబయిలో సైంటిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రీప్రొడక్టివ్‌ అండ్‌ ఛైల్డ్‌ హెల్త్‌... తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  సైంటిస్ట్‌-డి (మెడికల్‌): 01  
  •  ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌: 01  

అర్హత: డిగ్రీ (సైన్స్‌), మెడికల్‌ పీజీ, పీహెచ్‌డీతో పాటు సంబంధిత పని అనుభవం. వయసు: సైంటిస్ట్‌ పోస్టుకు 45 ఏళ్లు, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు సైంటిస్టుకు రూ.78,000. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌కు రూ.32,000. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-04-2024.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/


రామగుండం ఫర్టిలైజర్స్‌లో...

నోయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • చీఫ్‌ మేనేజర్‌: 01 
  • సీనియర్‌ మేనేజర్‌: 01

అర్హత: సీఎస్‌తో పాటు పని అనుభవం. లా గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఉంటుంది. జీతం: నెలకు చీఫ్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000. సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు రుసుము లేదు.

దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 25.04.2024.

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/careers2.php


వాక్‌-ఇన్‌

టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ..

ముంబయి  టాటా మెమోరియల్‌ సెంటర్‌.. ఐసీయూ/ ఓటీ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

అర్హత: హెచ్‌ఎస్‌సీ (సైన్స్‌), ఎలక్ట్రానిక్స్‌ ఏడాది సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సుతో పాటు పని అనుభవం. వేతనం: నెలకు రూ.23,000 - రూ.35,000.

ఇంటర్వ్యూ తేదీ: 04-04-2024.

ప్రదేశం: డైనింగ్‌ హాల్‌, ఫోర్త్‌ ఫ్లోర్‌, గోల్డెన్‌ జూబ్లీ బిల్డింగ్‌, టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌, డాక్టర్‌ ఎర్నస్ట్‌ బార్జస్‌ రోడ్‌, ముంబయి.

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/m_events/Events/JobVacancies


ప్రవేశాలు

సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ  

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)... పీహెచ్‌డీ 2024-ఖిఖి ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పరిశోధనాంశాలు: సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ, కంప్యుటేషనల్‌ బయాలజీ, డిసీజ్‌ బయాలజీ, జెనెటిక్స్‌, మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ. అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (సైన్స్‌, టెక్నాలజీ, అగ్రికల్చర్‌) లేదా ఎంబీబీఎస్‌. చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ/ ఐసీఎంఆర్‌/ ఇన్‌స్పైర్‌/ యూజీసీ- ఆర్‌జీఎన్‌ఎఫ్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.

వెబ్‌సైట్‌: http://www.cdfd.org.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని