నోటీస్ బోర్డు

 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మేఘాలయ - శాశ్వత ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 03 Apr 2024 01:14 IST

మేఘాలయలో వివిధ పోస్టులు

 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మేఘాలయ - శాశ్వత ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌
  •  టెక్నీషియన్‌  
  •  సూపరింటెండెంట్‌
  •  జూనియర్‌ అసిస్టెంట్‌  

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, మాస్టర్‌ డిగ్రీ, సీనియర్‌ సెకండరీ (10+2)తో పాటు పని అనుభవం. దరఖాస్తు రుసుము: రూ.200 దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024 వెబ్‌సైట్‌: https://www.nitm.ac.in/recruitment


ఎన్‌ఐటీ కురుక్షేత్రలో ఫ్యాకల్టీ  

కురుక్షేత్రలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)... వివిధ విభాగాల్లో 77 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-ఖిఖి  
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-ఖి
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధన అనుభవం. ఎంపిక: రాత పరీక్ష, ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2024.
దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 30.04.2024.
వెబ్‌సైట్‌: https://nitkkr.ac.in/jobs-nit-kkr/


ప్రవేశాలు

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌- 2024
ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (ఏపీ పీజీఎల్‌సెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు,  వాటి అనుబంధ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
కోర్సులు: మూడేళ్లు/ ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌. అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ. దరఖాస్తు ఫీజు: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.900. బీసీలకు 850. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు రూ.800. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.1000. బీసీలకు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.900.
పరీక్ష: అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు రెండు మాధ్యమాల్లో; ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2024
దరఖాస్తుల సవరణ తేదీలు: మే 30 నుంచి జూన్‌ 1 వరకు.
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03-06-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 09-06-2024.
వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని