వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో!

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్డు వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో 414  ఆగ్జిలరీ నర్సు, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌, స్టోర్‌ సూపర్‌ వైజర్‌ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 08 Apr 2024 00:10 IST

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్డు వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో 414  ఆగ్జిలరీ నర్సు, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌, స్టోర్‌ సూపర్‌ వైజర్‌ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ప్రకటించిన పోస్టుల్లో ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్‌, ఫార్మసిస్ట్‌ (డిస్పెన్సర్‌), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-3), అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలు ఎక్కువున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఏయే ఉద్యోగాలు?

డ్రైవర్‌ (డ్రగ్స్‌ కంట్రోల్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (లా, జస్టిస్‌ అండ్‌ లెజిస్టేటివ్‌ అఫైర్స్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (లోకాయుక్త), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌), డ్రైవర్‌ (ఎల్‌ఎంవీ), స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (దిల్లీ జైల్స్‌), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-3) కార్డియాలజీ మొదలైనవి), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రూప్‌-4) (బయోకెమిస్ట్రీ మొదలైనవి), ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్‌ (మున్సిపల్‌ కార్పొరేషన్‌), ఆగ్జిలరీ నర్సు/మిడ్‌వైఫ్‌ (మున్సిపల్‌ కౌన్సిల్‌), డ్రాఫ్ట్స్‌ మన్‌ గ్రేడ్‌-3 (సివిల్‌), స్టోర్‌కీపర్‌, స్టోర్‌ సూపర్‌వైజర్‌, పార్మసిస్ట్‌ (అగ్రి మార్కెటింగ్‌), జూనియర్‌ ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

ఎవరు అర్హులు?

1. ఆగ్జిలరీ నర్సు/ మిడ్‌వైఫ్‌-152: పది ఉత్తీర్ణత సాధించాలి. ఆగ్జిలరీ నర్స్‌/ మిడ్‌వైఫ్‌ డిప్లొమా పూర్తిచేసి, నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదైవుండాలి. హిందీ తెలిసి, గవర్నమెంట్‌/ సెమీ-గవర్నమెంట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌, వెల్ఫేర్‌ సెంటర్లలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఫార్మసిస్ట్‌ (డిస్పెన్సర్‌)-110: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్‌/ డిస్పెన్సర్‌గా నమోదైవుండాలి. హిందీ అర్థంచేసుకుని, పనిచేయగల నైపుణ్యం ఉండాలి. రెండేళ్లు ఫార్మసిస్ట్‌గా పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
3. ల్యాబ్‌ టెక్నీషియన్‌-54: పది/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఎంఎల్‌టీ డిప్లొమా పూర్తిచేసి ఏడాది అనుభవం ఉండాలి. లేదా సైన్స్‌ డిగ్రీ చదవాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.  
4. అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌-32: పది/తత్సమాన పరీక్ష పాసై, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమా పూర్తిచేయాలి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసినవారికి ప్రాధాన్యం. వయసు 18-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష ఎలా ఉంటుంది?

ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆగ్జిలరీ నర్సు మిడ్‌వైఫ్‌, అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌ పోస్టులకు: రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పన కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

ప్రశ్నపత్రంలో ఐదు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 40 మార్కులు. 1. జనరల్‌ అవేర్‌నెస్‌  2. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 3. అరిథ్‌మెటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 4. టెస్ట్‌ ఆఫ్‌ హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 5. టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

స్టోర్‌కీపర్‌, డ్రాఫ్ట్‌మెన్‌ గ్రేడ్‌-2 (సివిల్‌), స్టాఫ్‌ డ్రైవర్‌, స్టోర్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు: రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. సెక్షన్‌-ఎలో 1. జనరల్‌ అవేర్‌నెస్‌ 2. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 3. అరిథ్‌మెటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 4. టెస్ట్‌ ఆఫ్‌ హిందీ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 5. టెస్ట్‌ ఆప్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. ప్రతి విభాగానికీ 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. సెక్షన్‌-బిలో 100 ప్రశ్నలకు 100 మార్కులు. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. సెక్షన్‌-ఎ, బిల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను తయారుచేస్తారు. అవసరమైన ఉద్యోగాలకు స్కిల్‌/ ఎండ్యూరెన్స్‌/ డ్రైవింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2024
వెబ్‌సైట్‌: https://dsssbonline.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని