నోటీస్‌బోర్డు

నోయిడా, బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ - ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 08 Apr 2024 00:09 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

నోయిడాలో వివిధ పోస్టులు

నోయిడా, బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ - ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • మెడికల్‌ ఆఫీసర్‌: 04
 • ఫార్మసిస్ట్‌: 02
 • వార్డ్‌ అటెండెంట్‌: 02
 • పంచకర్మ టెక్నీషియన్‌: 10  
 • స్టాఫ్‌ నర్స్‌: 10
 • పంచకర్మ అటెండెంట్‌: 07
 • ల్యాబ్‌ అటెండెంట్‌: 06
 • పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌: 1
 • ఓటీ టెక్నీషియన్‌: 1
 • గార్డెన్‌ సూపర్‌వైజర్‌: 02
 • మ్యూజియం కీపర్‌: 02
 • ఐటీ అసిస్టెంట్‌: 02  
 • అసిస్టెంట్‌ లైబ్రరీ ఆఫీసర్‌: 1
 • రిసెప్షనిస్ట్‌: 02
 • హెల్ప్‌ డెస్క్‌ రిసెప్షనిస్ట్‌: 02

అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, బీఫార్మసీ, డిప్లొమా, ఇంటర్‌, బీఎస్సీ నర్సింగ్‌, పదోతరగతి, డిగ్రీ, పీజీ, ఎమ్‌ఎల్‌ఐబీ, బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2024
వెబ్‌సైట్‌: www.becil.com/vacancies


నిఫ్ట్‌- రాయ్‌బరేలిలో అసిస్టెంట్‌లు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) - రాయ్‌బరేలి ఒప్పంద ప్రాతిపదికన 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మెషిన్‌ మెకానిక్‌ 2. అసిస్టెంట్‌ (అడ్మిన్‌)
3. అసిస్టెంట్‌ వార్డెన్‌- (యువతులకు) 4. నర్స్‌
5. జూనియర్‌ అసిస్టెంట్‌ 6. లైబ్రరీ అసిస్టెంట్‌
7. ల్యాబ్‌ అసిస్టెంట్‌ 8. స్టెనోగ్రాఫర్‌

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, పీజీలతో పాటు పని అనుభవం.
వయసు: 27 సంవత్సరాలు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ లేదా కాంపిటెన్సీ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2024
వెబ్‌సైట్‌: www.nift.ac.in/raebareli/careers


ప్రవేశాలు

సీఐటీడీలో డిప్లొమా కోర్సులు  

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సు.. సీట్ల వివరాలు-

1. డిప్లొమా ఇన్‌ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం): 60
2. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఖీ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీఈసీఈ): 60
3. డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (డీఏఆర్‌ఈ): 60  
4. డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (డీపీఈ): 60

వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు మూడేళ్లు.
అర్హత: 10వ తరగతి.
వయసు: 20-05-2024 నాటికి 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ లకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
సీటు కేటాయింపు: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.800; ఎస్సీ/ ఎస్టీలకు రూ.400.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ /ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 26-05-2024.
ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.citdindia.org/diploma-admissions-2024.php


అప్రెంటిస్‌

మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ), బైలడిలా ఐరన్‌ ఓర్‌ మైన్‌, కిరందుల్‌ కాంప్లెక్స్‌... కింది విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

 • ట్రేడ్‌ అప్రెంటిస్‌: 147  
 • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 37  
 • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 09

మొత్తం ఖాళీలు: 193.

విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానిక్‌ డీజిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26.
వేదిక: బైలా క్లబ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఐఓఎం, కిరందుల్‌ కాంప్లెక్స్‌, కిరందుల్‌, దంతేవాడ, ఛత్తీస్‌గఢ్‌.
వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/careers


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని