గేట్‌ స్కోరుతో... ఏఏఐలో అవకాశాలు

న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 490 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హతలు, గేట్‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 10 Apr 2024 00:04 IST

న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 490 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హతలు, గేట్‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 490 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 240, ఈడబ్ల్యూఎస్‌లకు 45, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 106, ఎస్సీలకు 73, ఎస్టీలకు 26 కేటాయించారు.

1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌)-3: ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పాసై, కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో రిజిస్టరైవుండాలి.
2. జేఈ (సివిల్‌) - 90: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ ఉత్తీర్ణులు కావాలి.
3. జేఈ (ఎలక్ట్రికల్‌) - 106: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌/ టెక్నాలజీ పాసవ్వాలి.
4. జేఈ (ఎలక్ట్రానిక్స్‌) - 278: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రికల్‌ (ఎలక్ట్రానిక్స్‌ స్పెషలైజేషన్‌తో) ఉత్తీర్ణత సాధించాలి.
5. జేఈ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) -13: బీఈ ఇన్‌ ఇంజినీరింగ్‌/ టెక్నికల్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌  లేదా మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ) పాసవ్వాలి.

అన్ని పోస్టులకూ గేట్‌-2024 స్కోరు ఉండాలి.

బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే ధ్రువపత్రాల పరిశీలన సమయానికి పాసైవుండాలి.

01.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఏఏఐలో ఏడాది ప్రొబేెషన్‌ పూర్తిచేసినవారికి పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ తాజా నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము రూ.300 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఏఏఐలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పూర్తిచేసినవారు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక: దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా అప్లికేషన్‌ వెరిఫికేషన్‌కు షార్ట్‌లిస్టును తయారుచేస్తారు. వెరిఫికేషన్‌ సమయంలో ఒరిజినల్‌ ధ్రువపత్రాలను సమర్పించాలి.

  • అప్లికేషన్‌ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. కాల్‌ లెటర్లను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీకి పంపిస్తారు.
  • కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నవారు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాలి.
  • ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకానివారి అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తారు.
  • గేట్‌ స్కోర్‌కు మొదటి ప్రాధాన్యమిస్తారు.
  • ఎంపికైనవారికి ఆరు నెలల శిక్షణ ఉంటుంది. వీరిని  దేశవ్యాప్తంగా ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనుభవం అవసరం లేదు. ప్రకటనలో పేర్కొన్న విద్యార్హతలు, గేట్‌ స్కోర్‌ ఉంటే సరిపోతుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2024
వెబ్‌సైట్‌: https://www.aai.aero/


రామానంద తీర్థ సంస్థలో ఉపాధి కోర్సులు

యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ... ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తారు.

శిక్షణ, కాల వ్యవధి వివరాలు...

1. బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌): 03 నెలలు
అర్హత: ఇంటర్మీడియట్‌.

2. అకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ): 03 నెలలు
అర్హత: బీకాం.

3. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్‌: 03 నెలలు
అర్హత: ఇంటర్మీడియట్‌.

4. ఆటోమొబైల్‌- టూ వీలర్‌ సర్వీసింగ్‌: 03 నెలలు
అర్హత: పదోతరగతి.

5. సెల్‌ఫోన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ రిపేర్‌: 04 నెలలు
అర్హత: పదోతరగతి.

6. ఎలక్ట్రీషియన్‌ (డొమెస్టిక్‌): 05 నెలలు
అర్హత: పదోతరగతి, ఐటీఐ.

7. సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్‌/ సర్వీస్‌: 04 నెలలు
అర్హత: పదోతరగతి, ఐటీఐ.

వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్‌, నకళ్లు, ఫొటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి.

అడ్మిషన్‌ తేదీ: 15-04-2024 ఉదయం 10 గంటలు.

చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌ (గ్రామం), పోచంపల్లి (మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా.

వెబ్‌సైట్‌: https://www.srtri.com/index.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని