నోటిఫికేషన్స్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎకనామిక్స్‌/ స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2024 నిర్వహించనుంది.

Published : 13 Apr 2024 00:44 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌

యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ 2024

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎకనామిక్స్‌/ స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2024 నిర్వహించనుంది.

మొత్తం పోస్టులు: 48
ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌/ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2024
1. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌: 18
2. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌: 30

అర్హత: ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్‌/ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌); స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.8.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (1000 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ (200 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 1 నుంచి 7 మే 2024 వరకు.
రాతపరీక్ష తేదీ: 21 జూన్‌ 2024.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

ఎస్‌ఈఎస్‌ఆర్‌, నాగ్‌పుర్‌లో యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈఎస్‌ఆర్‌) 2024-25 సంవత్సరానికి నాగ్‌పుర్‌ డివిజన్‌, మోతీబాగ్‌ వర్క్‌షాప్‌ (నాగ్‌పుర్‌)లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 861

ట్రేడులు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌, ప్లంబర్‌, పెయింటర్‌, వైర్‌మ్యాన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌ మొదలైనవి.
అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (10-04-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09 మే 2024.
వెబ్‌సైట్‌: https:///~ecr.indianrailways.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని