నోటీస్‌ బోర్డు

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ... తాత్కాలిక ప్రాతిపదికన 5 టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 Apr 2024 00:03 IST

ఉద్యోగాలు

ఎన్‌ఐటీలో టీచింగ్‌ అసిస్టెంట్లు

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ... తాత్కాలిక ప్రాతిపదికన 5 టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 55 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు పీజీ అభ్యర్థులకు రూ.45,000, పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.60,000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపాలి.
చిరునామా: ది హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సూరత్‌, గుజరాత్‌.
దరఖాస్తుకు చివరి తేదీ: 22-04-2024.
వెబ్‌సైట్‌: www.svnit.ac.in/web/jobs.php


ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ- ఒప్పంద ప్రాతిపదికన 6 కన్సల్టెంట్‌ (టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ (లైఫ్‌ సైన్సెస్‌/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 - రూ.80,000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024.
వెబ్‌సైట్‌: www.rcb.res.in/index.php?param=quicklinks/2109


ప్రవేశాలు

ఆర్‌సీబీ, ఫరీదాబాద్‌లో ఎంఎస్‌-పీహెచ్‌డీ  

ఫరీదాబాద్‌ (హరియాణా)లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయో టెక్నాలజీ... 2024 విద్యా సంవత్సరానికి ఎంఎస్‌-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్త్తోంది.

సీట్ల సంఖ్య: 20.
అర్హత: కనీసం 60% మార్కులతో సైన్స్‌, ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌ తదితర బ్రాంచుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వ్యాలిడ్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- బయోటెక్నాలజీ (గ్యాట్‌-బి) స్కోరు.
ప్రోగ్రామ్‌ వ్యవధి: 5- 7 ఏళ్లు.
ఎంపిక: గ్యాట్‌-బి స్కోర్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌ రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30-04-2024.
వెబ్‌సైట్‌: www.rcb.res.in/index.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని