ప్రభుత్వ ఉద్యోగాలు

దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి  అవివాహిత పురుషుల నుంచి ఇండియన్‌ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 17 Apr 2024 00:36 IST

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి  అవివాహిత పురుషుల నుంచి ఇండియన్‌ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

కోర్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇతర ఇంజినీరింగ్‌ స్ట్రీమ్స్‌.

మొత్తం ఖాళీలు: 30.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01-01-2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, స్టేజ్‌-1/ స్టేజ్‌-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ తనిఖీ, వైద్యపరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.

వెబ్‌సైట్‌:https://joinindianarmy.nic.in/


వాక్‌-ఇన్స్‌

సమీర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సమీర్‌) వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన 14 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వూలు నిర్వహిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 11
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌): 01
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌): 01  
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (సివిల్‌): 01  

అర్హత: పోస్టును అనుసరించి 55% మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 24, 25.

వేదిక: సమీర్‌- సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌, సీఐటీ క్యాంపస్‌, 2వ క్రాస్‌ రోడ్‌, తారామణి, చెన్నై.

వెబ్‌సైట్‌:https://sameer.gov.in/


ప్రవేశాలు

నేషనల్‌ లా వర్సిటీలో జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం

న్యూదిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎల్‌ఎల్‌బీ.

ఎంపిక: రాత ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-06-2024.

హాల్‌ టికెట్ల విడుదల: 13-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 23-06-2024.

వెబ్‌సైట్‌:https://nludelhi.ac.in/home.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని