సెయిల్‌లో మేనేజర్‌ కొలువులు

మహారత్న కేటగిరీకి చెందిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌).. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌, గనులు, రాంచీలోని సెంటర్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఈటీ)ల్లో 55 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 29 Apr 2024 00:05 IST

మహారత్న కేటగిరీకి చెందిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌).. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌, గనులు, రాంచీలోని సెంటర్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఈటీ)ల్లో 55 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 55 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 30, ఎస్సీలకు 6, ఎస్టీలకు 3, ఓబీసీలకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 4 కేటాయించారు.

బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో..

1. మేనేజర్‌ (ఆటోమేషన్‌ గ్రేడ్‌-ఇ-3)-9: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ పాసై.. ప్రభుత్వ/ ప్రభుత్వ అనుబంధ సంస్థ/ పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలో ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

  •  పీఎల్‌సీ, ఏసీ/ఈసీ డ్రైవ్స్‌, యూపీఎస్‌, డిజిటల్‌ ఎక్సిటేషన్‌ సిస్టమ్స్‌, లెవెల్‌-2 ఆటోమేషన్‌ సిస్టమ్స్‌లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం.
  •  స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యం.

2. మేనేజర్‌ (మెకానికల్‌/ బీఎస్‌ఎల్‌)-5: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి. ప్రభుత్వ/ ప్రభుత్వ అనుబంధ సంస్థ/ పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఏడేళ్ల అనుభవం ఉండాలి.

  • స్టీల్‌ ప్లాంట్‌లో మెకానికల్‌ మెయింటెనెన్స్‌/ హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ మెయింటెనెన్స్‌ చేసిన వారికి ప్రాధాన్యం.

3. మేనేజర్‌ (సివిల్‌)-2: సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌Ÿ. ప్రభుత్వ/ అనుబంధ/ పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఏడేళ్ల పని అనుభవం.

  •  స్టీల్‌ పరిశ్రమలో స్ట్రక్చరల్‌ డిజైన్‌/ ఫ్యాబ్రికేషన్‌/ హెల్త్‌ అసెస్‌మెంట్‌లో అనుభవానికి ప్రాధాన్యం.

4. మేనేజర్‌ (సిరామిక్స్‌)-2: సిరామిక్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ పాసవ్వాలి. ప్రభుత్వ/ ప్రభుత్వ అనుబంధ/ పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఏడేళ్ల పని అనుభవం. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్స్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యం.

5. డిప్యూటీ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌)-10: మెకానికల్‌/ సివిల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌, సంబంధిత రంగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

  •  ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/ ఎగ్జిక్యూషన్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌)లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

జార్ఖండ్‌ గనుల్లో..

1. మేనేజర్‌ (జియాలజీ)-3: ఎమ్మెస్సీ/ ఎమ్మెస్సీ (టెక్‌)/ ఎంటెక్‌ జియాలజీ/ అప్లైడ్‌ జియాలజీ పాసవ్వాలి. సంబంధిత రంగంలో ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల అనుభవం ఉండాలి. ః మైన్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో అనుభవానికి ప్రాధాన్యం.

2. మేనేజర్‌ (మినరల్‌ బెనిఫికేషన్‌)-3: బీటెక్‌ (మినరల్‌ ఇంజినీరింగ్‌/ (మైనింగ్‌ ఖీ మినరల్‌ ప్రాసెసింగ్‌)/ ఎంటెక్‌ (మినరల్‌ ప్రాసెసింగ్‌) పూర్తిచేయాలి. సంబంధిత రంగంలో ఏడేళ్ల అనుభవం. ఐరన్‌ ఓర్‌ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం.

3. మేనేజర్‌ (మెకానికల్‌)-3: మెకానికల్‌/ మైనింగ్‌ మెషినరీలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. గనుల్లోని హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మెషినరీ మరమ్మతులు, నిర్వహణలో ఏడేళ్ల అనుభవం ఉండాలి. ః ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఓర్‌ ప్రాసెసింగ్‌/ పరిశ్రమ నిర్వహణలో పనిచేసినవారికి ప్రాధాన్యం.

4. మేనేజర్‌ (మైనింగ్‌)-8: మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌. ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.  

సీఈటీ, రాంచీలో..

1. మేనేజర్‌ (సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌)-2: సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ పూర్తిచేయాలి. కన్సల్టెన్సీ/ డిజైన్‌ ఖీ ఇంజినీరింగ్‌/ ప్రాజెక్ట్స్‌ ఖీ కన్‌స్ట్రక్షన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

2. మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)-2: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ ఖీ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌.

  •  డిజైన్‌ ఖీ ఇంజినీరింగ్‌/ ప్రాజెక్ట్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌/ ఆపరేషన్‌ ఖీ మెయింటెనెన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల అనుభవం.

3. మేనేజర్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ప్రాసెస్‌, కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌)-1: ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌/ ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి.

  • స్టీల్‌/ పవర్‌ప్లాంట్‌/ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌లో కన్సల్టెన్సీ/ డిజైన్‌ & ఇంజినీరింగ్‌/ ప్రాజెక్ట్స్‌ & కన్‌స్ట్రక్షన్‌/ ఆపరేషన్‌ & మెయింటెనెన్స్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల అనుభవం.

4. మేనేజర్‌ (మెకానికల్‌/ యూఅండ్‌ఎస్‌)-3: మెకానికల్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌. ః కన్సల్టెన్సీ/ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ప్రాజెక్ట్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌/ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల అనుభవం ఉండాలి.

5. మేనేజర్‌ (మెటలర్జీ/టెక్నాలజీ - ఐరన్‌ అండ్‌ సింటర్‌/ స్టీల్‌/ రోలింగ్‌ మిల్స్‌)-2: మెటలర్జీ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ పాసవ్వాలి.

  • కన్సల్టెన్సీ/ డిజైన్‌ & ఇంజినీరింగ్‌/ ప్రాజెక్ట్స్‌ & కన్‌స్ట్రక్షన్‌/ ఆపరేషన్‌ & మెయింటెనెన్స్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఏడేళ్ల అనుభవం ఉండాలి.

    ఎంపిక

అన్ని పోస్టులకూ 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.700. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు రూ.200.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. అర్హులైనవారికి అడ్మిట్‌కార్డ్‌/ కాల్‌ లెటర్‌ పంపుతారు. దీన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

  •  సీబీటీలో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. డొమైన్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు చెందిన 50 ప్రశ్నలు. ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 100 ప్రశ్నలు ఇస్తారు.
  •  ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌ 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీలు 40 శాతం మార్కులు సాధించాలి.
  •  రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  •  సీబీటీ, ఇంటర్వ్యూలకు 80:20 వెయిటేజీ ఉంటుంది. అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 72 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 75 సెం.మీ. వరకూ పెరగాలి. మహిళలు 143 సెం.మీ.ఎత్తు, 35 కేజీల బరువుండాలి.

రాత, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తుకు చివరి తేదీ: 08.05.2024
  • వెబ్‌సైట్‌: https://sailcareers.com

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని