క్రీడాకారులకు అవకాశాలు!

న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 02 May 2024 00:06 IST

నార్తర్న్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా

న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటికంటే ఎక్కువ విభాగాల్లో పోటీ పడాలంటే ప్రతి క్రీడకూ వేర్వేరుగా దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించాలి.

క్రీడాంశాలు: ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, రెజ్లింగ్‌, చెస్‌.

పదో తరగతి/ మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసవడంతోపాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపాలి. 01.07.2024 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, ఈబీసీ, మైనారిటీలకు రూ.250.

క్రీడార్హతలు: 01.04.2021 నుంచీ వివిధ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు.

  • క్రీడా విభాగంలో ఏ స్థాయిలో పాల్గొన్నారనే వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తులో స్పష్టంగా రాయాలి.
  • వివిధ క్రీడల్లో సాధించిన ఛాంపియన్‌షిప్‌లకు అంతర్జాతీయ/ జాతీయ/ రాష్ట్ర స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌, రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ గుర్తింపు ఉండాలి.
  • కేటగిరీ ‘సి’ ఛాంపియన్‌షిప్స్‌/ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలి.

లేదా ఫెడరేషన్‌ కప్‌ ఛాంపియన్‌షిప్స్‌లో (సీనియర్‌ కేటగిరి) కనీసం మూడో స్థానం పొందాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం.. ట్రయల్స్‌ నిర్వహిస్తారు. వీటిల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన అభ్యర్థులనే తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ప్రతిభను ట్రయల్‌ కమిటీ అంచనా వేసి.. అర్హులో కాదో నిర్ణయిస్తుంది.

  • ట్రయల్స్‌ కోసం అభ్యర్థులు సొంత ప్లేయింగ్‌ కిట్‌ను తెచ్చుకోవాలి.
  • ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు 25 మార్కులు, ఆపైన, ప్రదర్శన సంతృప్తికరంగాలేని అభ్యర్థులకు 25 కంటే తక్కువ మార్కులు ఇస్తారు.
  • ప్రతిభ కనబరిచినవారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. క్రీడా విజయాలకు 50 మార్కులు, విద్యార్హతలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/ పర్సనాలిటీకి 10 మార్కులు కేటాయిస్తారు.
  • రెండు దశల్లోనూ అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కనీసార్హత మార్కులు 60.
  • ఈ మార్కులు సాధించిన వారికి మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 16.05.2024
ట్రయల్‌ తేదీ: 10.06.2024
వెబ్సైట్‌: www.rrcnr.org


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని