హెచ్‌యూఆర్‌ఎల్‌లో అవకాశాలు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ల జాయింట్‌ వెంచర్‌.. హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌).

Published : 06 May 2024 00:07 IST

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ల జాయింట్‌ వెంచర్‌.. హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌). ఈ సంస్థ మేనేజర్‌, ఇంజినీర్‌, ఆఫీసర్‌ మొదలైన 80 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఈ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. విద్యార్హతలు, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల జాబితాను తయారుచేస్తారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఏడాది ప్రొబేషన్‌ ఉంటుంది. మూడేళ్ల వ్యవధి తర్వాత సంస్థ అవసరాలూ, అభ్యర్థి పనితీరును బట్టి మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను మాత్రమే రాయాలి. తాజా ఉద్యోగ సమాచారాన్ని వీటికి తెలియజేస్తారు. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను దేశీయ యూనివర్సిటీలు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి పొందాలి. విదేశీ యూనివర్సిటీల్లో చదివినట్లయితే తత్సమాన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. టీచింగ్‌/ ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌-టైమ్‌ జాబ్‌, అప్రెంటిస్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌ అండ్‌ ఆర్టికల్‌షిప్‌ అనుభవాలను ఉద్యోగ అనుభవంగా పరిగణనలోకి తీసుకోరు.

1. మేనేజర్‌ (ఎల్‌2)-20: ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, కెమికల్‌, కెమికల్‌ (అమోనియా), కెమికల్‌ (యూరియా), కెమికల్‌ (ప్రాసెస్‌ సపోర్ట్‌) మొదలైన విభాగాల్లో ఉన్నాయి. అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 40 ఏళ్లు.

2. ఇంజినీర్‌ (ఎల్‌1)-34: ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. కెమికల్‌ (యూరియా), కెమికల్‌ (అమోనియా), కెమికల్‌ (ఓఅండ్‌యూ), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మొదలైన విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.  

3. ఆఫీసర్‌ (ఎల్‌1)-14: ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. సేఫ్టీ, మార్కెటింగ్‌, కాంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, ఫైనాన్స్‌ మొదలైన విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

4. చీఫ్‌ మేనేజర్‌ (ఎల్‌3)-2: ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌/ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యులు కావాలి. లేదా రెండేళ్ల పీజీడీఎం/ ఎంబీఏ (ఫైనాన్స్‌) 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. జనరల్‌ ఎంబీఏ/ డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ చేసినవారు దరఖాస్తుకు అనర్హులు. గరిష్ఠ వయసు 47 ఏళ్లు. అదనపు విద్యార్హతలు ఉన్నవారికీ లేదా ఫెర్టిలైజర్‌ రంగం/ ప్రాసెసింగ్‌ కంపెనీలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు.

5. అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎల్‌1)-7: కమ్యూనికేషన్‌/ అడ్వర్టైజింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌/ మాస్‌ కమ్యూనికేషన్‌/ జర్నలిజం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ మొదలైన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గరిష్ఠ వయసు 45 ఏళ్లు.

6. ఆఫీసర్‌ (లీగల్‌)-3: ఎల్‌ఎల్‌బీ/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఫుల్‌టైమ్‌ లా డిగ్రీ ఉండాలి. పేరున్న సంస్థలో ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. గరిష్ఠ వయసు 35 ఏళ్లు.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.05.2024

వెబ్‌సైట్‌: https://jobs.hurl.net.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని