నోటీస్‌బోర్డు

భారత నౌకాదళం అగ్నివీర్‌(ఎంఆర్‌) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అవివాహితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 09 May 2024 00:39 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్‌ నేవీ

భారత నౌకాదళం అగ్నివీర్‌(ఎంఆర్‌) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అవివాహితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత

వయసు: 01.11.2003 - 30.04.2007 మధ్యలో జన్మించినవారు అర్హులు

ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: స్టేజ్‌-1 అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌ (ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌), స్టేజ్‌-2 (దేహదార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), రాత పరీక్ష, వైద్య పరీక్షలతో.

వేతనం: మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేలు చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.550.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 13-05-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-05-2024.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/

 


ప్రవేశాలు

ట్రిపుల్‌ఐటీ-ఏపీలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌

పీలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.

ట్రిపుల్‌ ఐటీ కేంద్రాలు: ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌, నూజివీడు క్యాంపస్‌, శ్రీకాకుళం క్యాంపస్‌, ఒంగోలు క్యాంపస్‌.

సీట్లు: ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి చొప్పున 4 క్యాంపస్‌ల్లో 4000 ఉన్నాయి. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 400 సీట్లు అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు ఏపీతోపాటు తెలంగాణ విద్యార్థులూ పోటీ పడవచ్చు.

అర్హత: ఈ సంవత్సరం (2024) పదో తరగతి ఉత్తీర్ణులే అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం. ఏపీ, తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.200, మిగిలినవారికి రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: 25-6-2024 సాయంత్రం 5 గంటల వరకు.

వెబ్‌సైట్‌: https://www.rgukt.in/


వాక్‌-ఇన్స్‌

సీనియర్‌ రెసిడెంట్లు

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ హాస్పిటల్‌, పుణే - తాత్కాలిక ప్రాతిపదికన 7 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాలు: జనరల్‌ సర్జరీ, ఆఫ్తాల్మాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ, ఇఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌. అర్హత: సంబంధిత విభాగంలో పీజీ లేదా పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.67,700.

ఇంటర్వ్యూ తేదీ: 15-05-2024

ప్రదేశం: ఇఎస్‌ఐసి హాస్పిటల్‌, బిబ్‌వేవాది పుణే, సర్వే నెం.690.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/


ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్టులు

సీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రీప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, ముంబయి - తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

1.ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ -I: 04

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ

వేతనం: నెలకు రూ.60,000

వయసు: 35 ఏళ్లు మించరాదు.

ఇంటర్వ్యూ తేదీ: 22-05-2024

ప్రదేశం: ఐసీఎంఆర్‌ -ఎన్‌ఐఆర్‌ఆర్‌సిహెచ్‌, ముంబై

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని