నోటీస్‌బోర్డు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 May 2024 00:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
టీహెచ్‌ఎస్‌టీఐలో రిసెర్చ్‌ ఆఫీసర్లు  

రియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • క్లినికల్‌ రిసెర్చ్‌ కోఆర్డినేటర్‌: 01  
  • రిసెర్చ్‌ ఆఫీసర్‌: 01  
  • రిసెర్చ్‌ అసోసియేట్‌I/II/III: 01
  • అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ ఎండీ/ డీఎన్‌బీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.236.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-05-2024.

వెబ్‌సైట్‌: https://thsti.res.in/


వాక్‌-ఇన్స్‌

రిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్లు  

ణిపుర్‌ రాష్ట్రం ఇంఫాల్‌లోని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన  11 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫార్మకాలజీ, నెఫ్రాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌, అనాటమీ, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌, సర్జరీ, యూరాలజీ.

అర్హత: ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో పీజీ.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు పంపించాల్సిన చిరునామా: ది సెక్షన్‌ ఆఫీసర్‌ (జనరల్‌ సెక్షన్‌), రిమ్స్‌, ఇంఫాల్‌.

ఇంటర్వ్యూ తేదీ: 23-05-2024.

వేదిక: రిమ్స్‌, ఇంఫాల్‌, మణిపుర్‌.

వెబ్‌సైట్‌: https://www.rims.edu.in/


ప్రవేశాలు

ఏపీలో ఐటీఐ కోర్సులు

విజయవాడలోని ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం 2024- 2025 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడులు: కార్పెంటర్‌, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌ తదితరాలు.

అర్హత: 10వ తరగతి.

వయసు: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు.

సీటు కేటాయింపు: అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతలతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ప్రిన్సిపల్స్‌తో అప్రూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటివారి పేర్లను మెరిట్‌ లిస్టులో పొందుపరుస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2024.

వెబ్‌సైట్‌: https://iti.ap.gov.in/


సంస్కృత విశ్వవిద్యాలయంలో..

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం .. 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఆచార్య, ఎంఏ (సద్బోధ), ఎంఏ హిందీ, ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌, యోగా థెరఫీ), ఎంఏఐఎంటీ, ప్రాక్‌ శాస్త్రి.

అర్హత: సీయూఈటీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2024.
వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని