టెక్స్‌టైల్స్‌ కమిటీలో ఉపాధి అవకాశాలు

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్స్‌ కమిటీ 40 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్స్‌టైల్స్‌ టెస్టింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 May 2024 00:21 IST

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్స్‌ కమిటీ 40 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్స్‌టైల్స్‌ టెస్టింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపాలి.

మొత్తం పోస్టుల్లో రీజియన్లవారీగా..  బెంగళూరు-4, చెన్నై-3, దిల్లీ (ఎన్‌సీఆర్‌)-3, గుంటూరు-1, హైదరాబాద్‌-4, జైపుర్‌-2, కాన్పూర్‌-1, కన్నూర్‌-1, కరూర్‌-1, ముంబయి-10, తిరుపుర్‌-3, కోయంబత్తూర్‌-5, లూధియానా-1, కోల్‌కతా-1 ఉన్నాయి.

దరఖాస్తు చేయాలంటే...అభ్యర్థులకు బీఎస్సీ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ) లేదా టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీలో బీటెక్‌ అర్హత ఉండాలి. 31.03.2024 నాటికి వయసు 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. ముందుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఎంపికైనవారికి మొదటి ఏడాది రూ.26,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. తర్వాత అభ్యర్థి పనితీరు ఆధారంగా స్టైపెండ్‌ పైన 3 శాతం పెంచి.. ఆ మొత్తాన్ని రెండేళ్లపాటు చెల్లిస్తారు. వీరికి టెక్స్‌టైల్స్‌ టెస్టింగ్‌, టెస్ట్‌ డేటా విశ్లేషణలో సమగ్రమైన శిక్షణను అందజేస్తారు. వస్త్ర రంగంలో అవగాహన, అనుభవాన్ని గడించే విధంగా మెరుగైన శిక్షణను అందజేస్తారు.

గమనించాల్సినవి

కరు ఒక రీజియన్‌లోనే దరఖాస్తు చేయాలి.

  • రాత పరీక్ష/ ఇంటర్వ్యూ దేని ద్వారా ఎంపిక చేస్తారనేది అభ్యర్థులకు తర్వాత తెలియజేస్తారు.
  • తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీచేస్తారు.
  • సంస్థ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన కాపీలు, పాస్‌పోర్ట్‌ ఫొటోగ్రాఫ్‌ను జతచేసి ప్రకటనలో పేర్కొన్న చిరునామాకు పంపాలి.
  • ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి టీఏ/ డీఏలను చెల్లించరు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024

తెలంగాణ: టెక్స్‌టైల్స్‌ కమిటీ, ఫస్ట్‌ ఫ్లోర్‌, యూఎన్‌ఐ బిల్డింగ్‌, డోర్‌ నంబర్‌: 10-1-1200, ఏసీ గార్డ్స్‌, మాసాబ్‌ ట్యాంక్‌ రోడ్‌, హైదరాబాద్‌ - 500 004.

ఆంధ్రప్రదేశ్‌: టెక్స్‌టైల్స్‌ కమిటీ, సాయిరాం కాంప్లెక్స్‌, డోర్‌ నంబర్‌: 25-1-9, మస్తాన్‌ దర్గా దగ్గర, జీటీ రోడ్‌, గుంటూరు-522 004.

వెబ్‌సైట్‌: https://textilescommittee.nic.in/recruitment-post-young-professional-designated-project-assistant-textile-testing


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని