ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 54 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 20 May 2024 00:06 IST

కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 54 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల ఎంపిక అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. ఎంపికైనవారిని దిల్లీ, ముంబయి, చైన్నైలలో నియమిస్తారు. 

మొత్తం 54 ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 27, ఈడబ్ల్యూఎస్‌లకు 4, ఓబీసీలకు 13, ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 కేటాయించారు. 
1. ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌)-28: 

  • కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి. లేదా 
  • మూడేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ) ఉత్తీర్ణులవ్వాలి. లేదా 
  • కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌ లో బీసీఏ/ బీఎస్సీ పూర్తిచేయాలి. 
  • వయసు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • ఏడాది ఉద్యోగానుభవం అవసరం. 
  • ఎంపికైన వారికి ఏడాదికి గరిష్ఠంగా రూ.10 లక్షల సీటీసీ దక్కుతుంది.

2. ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌)- 21:

కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి. లేదా 

  • మూడేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. లేదా 
  • కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లో బీసీఏ/ బీఎస్సీ పూర్తిచేయాలి. 
  • వయసు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. 
  • ఎంపికైనవారికి ఏడాది రూ.15 లక్షల సీటీసీ అందజేస్తారు. 

3. ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌)-5:

కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. లేదా 

  • మూడేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ పూర్తిచేయాలి. లేదా కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లో బీసీఏ/ బీఎస్సీ పాసవ్వాలి. 
  • వయసు 22 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • ఆరేళ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి. 
  • ఎంపికైనవారు ఏడాదికి రూ.25 లక్షల సీటీసీ పొందుతారు. దరఖాస్తు రుసుము రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150.

ఎంపిక: పోస్టులను అనుసరించి అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

  • విద్యార్హతలు, అనుభవం, కేటగిరీలవారీగా ఉన్న ఖాళీల ఆధారంగా స్క్రీనింగ్‌ నిర్వహించి అభ్యర్థుల షార్ట్‌లిస్టును తయారుచేస్తారు. 
  • వివిధ దశల్లో అర్హత సాధించి.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. 
  • ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తుచేసేవారు.. ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తులు పంపాలి. 
  • రాత పరీక్ష/ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి ఎలాంటి టీఏ/ డీఏలను చెల్లించరు. 
  • దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.05.2024
వెబ్‌సైట్‌: https://www.ippbonline.com/ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని