నోటీస్‌బోర్డు

నేేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) రెండో విడత నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వెలువరించింది.  

Published : 20 May 2024 00:32 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష  

నేేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) రెండో విడత నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వెలువరించింది.  
ఖాళీలు: మొత్తం 404

  • నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్‌- 120)
  • నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌) పోస్టులు 34. 

అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)కి దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.  
వయసు: 02-01-2006 - 01-01-2009 మధ్య జన్మించిన, అవివాహిత పురుషులు, మహిళలు అర్హులు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా నియామకాలుంటాయి. 
దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు) 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 4-06-2024.
ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 1-09-2024. కోర్సులు ప్రారంభం: 02-07-2025.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
వెబ్‌సైౖట్‌: https://upsconline.nic.in/


షిప్‌యార్డులో జనరల్‌ వర్కర్‌ పోస్టులు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 15 జనరల్‌ వర్కర్‌ (క్యాంటీన్‌) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: 7వ తరగతి, ప్రభుత్వ ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుడ్‌ ప్రొడక్షన్‌/ ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సర్వీస్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్యాటరింగ్‌ అండ్‌ రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఒకేషనల్‌ సర్టిఫికెట్‌. మలయాళ భాషా పరిజ్ఞానంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం.
వయసు: 22 మే 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాత, ప్రాక్టికల్‌ పరీక్షల ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2024.
వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ 97 నాన్‌-అకడమిక్‌ సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (కాంట్రాక్ట్‌) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌/ డీఎం, ఎంసీహెచ్‌)/ ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ. 
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు. 
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024.
వేదిక: అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌.
వెబ్‌సైట్‌:https://aiimsgorakhpur.edu.in/


నెహ్రూ పోర్ట్‌ అథారిటీలో..  

నవీ ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 5 ఖాళీల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

  • మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌: 01
  • హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌: 02 
  • హిందీ టైపిస్ట్‌ కమ్‌ ట్రాన్స్‌లేటర్‌: 2  

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం. 
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: మే 28, 29, 30.
వేదిక: జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ, నవీ ముంబయి.
వెబ్‌సైట్‌:https://www.jnport.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని