నోటీస్‌బోర్డు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.. డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీల ద్వారా కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 May 2024 00:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.. డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీల ద్వారా కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం).  

స్పెషాలిటీ: మైక్రోబయాలజీ అండ్‌ ఫార్మకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-05-2024.

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ఐఐటీఎంలో ప్రాజెక్ట్‌ పోస్టులు 
పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మీటీయరాలజీ (ఐఐటీఎం).. ఒప్పంద ప్రాతిపదికన 65 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 4 బీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 11 
  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 4 బీ ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్‌: 1  
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 02 బీ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 08 
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 33 బీ రిసెర్చ్‌ అసోసియేట్‌ (డీప్‌ ఓషన్‌ మిషన్‌): 2  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 22-05-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-06-2024.
వెబ్‌సైట్‌: https://www.tropmet.res.in/


ప్రవేశాలు

శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో..

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం.. 2024-25 విద్యాసంవత్సరానికి కింది సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: శాస్త్రి (బీఏ), ఆచార్య (ఎంఏ), డిప్లొమా, సర్టిఫికెట్‌

అర్హతలు: కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, సంస్కృత పరిజ్ఞానం.

వయసు: శాస్త్రి కోర్సుకు 18-22 ఏళ్లు; ఆచార్య కోర్సుకు 20-25 ఏళ్లు; డిప్లొమా కోర్సుకు కనిష్ఠంగా 20 ఏళ్లు; సర్టిఫికెట్‌ కోర్సుకు కనిష్ఠంగా 18 లేదా 20 ఏళ్లు నిండి ఉండాలి.

సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష, సంస్కృత భాషా పరిజ్ఞానం ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-05-2024.

వెబ్‌సైట్‌: www.svvedicuniversity.ac.in/


శస్త్ర యూనివర్సిటీలో యూజీ, పీజీ  

తంజావూరు, కుంభకోణం, చెన్నై బ్రాంచీల్లోని శస్త్ర యూనివర్సిటీ  (డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ).. వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

యూజీ: బీటెక్, బీఎస్సీ, బీకాం, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీసీఏ, బీఆప్ట్, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ.

పీజీ: ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎఫ్‌ఏ, ఎంఆప్ట్, ఎంబీఏ.

అర్హత: కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, క్యాట్‌/ జీమ్యాట్‌/ గ్జాట్‌/ ఏఐమ్యాట్‌ స్కోరు ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: బీటెక్‌/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లకు జూన్‌ 15; బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీకాం ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులకు జూన్‌ 8.

వెబ్‌సైట్‌: https://www.sastra.edu/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని