నోటీస్‌బోర్డు

అమేథీ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గోలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 23 May 2024 00:10 IST

ప్రవేశాలు

ఏవియేషన్‌ వర్సిటీలో బీఎంఎస్‌  

అమేథీ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గోలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్లు: 120.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం సడలింపు ఉంటుంది.
వయసు: 21 ఏళ్లు మించకూడదు.
సీటు కేటాయింపు: 10+2 మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పీజీ డిప్లొమా ప్రోగ్రాం

రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్లు: 120.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం సడలింపు ఉంటుంది.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
సీటు కేటాయింపు: డిగ్రీ మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఈ రెండు కోర్సులకూ..

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-06-2024.
వెబ్‌సైట్‌: https://www.rgnau.ac.in/


ఎస్‌వీవీయూ, తిరుపతిలో ఎంవీఎస్సీ

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్ట్రీమ్‌: యానిమల్‌ బయోటెక్నాలజీ, యానిమల్‌ సైన్స్, వెటర్నరీ సైన్స్‌.
సీట్ల సంఖ్య: 80.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌తో పాటు ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ)- 2023 ర్యాంకు. వయసు: నోటిఫికేషన్‌ తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, కౌన్సెలింగ్‌ ఆధారంగా. రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750. దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2024.
కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07.06.2024.
కౌన్సెలింగ్‌ తేదీ: 11.06.2024.

పీహెచ్‌డీ కోర్సు

శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ బయోకెమిస్ట్రీ తదితరాలు.
సీట్ల సంఖ్య: 22.
అర్హత: ఎంవీఎస్సీతో పాటు ఐకార్‌ ఏఐసీఈ (జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు.
వయసు: నోటిఫికేషన్‌ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, కౌన్సెలింగ్‌ ఆధారంగా.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.
దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2024.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07.06.2024.
ఇంటర్వ్యూ తేదీ: 10.06.2024.

ఈ రెండు కోర్సులకూ...

మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ: 14.06.2024.
వెబ్‌సైట్‌: https://www.svvu.edu.in/


తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఎంవీఎస్సీ

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్‌ ఫ్యాకల్టీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ పోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

స్ట్రీమ్‌: వెటర్నరీ సైన్స్, యానిమల్‌ సైన్స్, యానిమల్‌ బయోటెక్నాలజీ.
రెగ్యులర్‌ అభ్యర్థులకు సీట్లు: 33.
ఇన్‌-సర్వీస్‌ (పశుసంవర్థక శాఖ) అభ్యర్థులకు సీట్లు: 10.
అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ.  
వయసు: 01-07-2023 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఐసీఏఆర్‌- ఏఐఈఈఏ (పీజీ)- 2023 ర్యాంకు ఆధారంగా.
గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 30-05-2024.

పీహెచ్‌డీ కోర్సు  

పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్‌ ఫ్యాకల్టీ పీహెచ్‌డీ పోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

పీహెచ్‌డీ కోర్సులు: 9 సీట్లు
సబ్జెక్టులు: వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ సర్జరీ అండ్‌ రేడియాలజీ, యానిమల్‌ న్యూట్రిషన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ.  
వయసు: 01-07-2023 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఐసీఏఆర్‌- ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)- 2023 ర్యాంకు ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-05-2024.

ఈ రెండు కోర్సులకూ...

కౌన్సెలింగ్‌ తేదీ: 05-06-2024.
మొదటి సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ: 06-06-2024.
వెబ్‌సైట్‌: https://tsvu.edu.in/home.aspx


వాక్‌-ఇన్‌

ఐటీఆర్‌లో పరిశోధన

చాందీపూర్, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌): 02  
  • రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ): 01

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు గేట్‌ స్కోరు.
వయసు: జేఆర్‌ఎఫ్‌ పోస్టుకు 28 ఏళ్లు, ఆర్‌ఏ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జేఆర్‌ఎఫ్‌ పోస్టుకు రూ.37,000, ఆర్‌ఏ పోస్టుకు రూ.67,000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-06-2024.
వెబ్‌సైట్‌: https://drdo.gov.in/drdo/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని