నోటీస్‌ బోర్డు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ).. పార్ట్‌టైమ్‌ విధానంలో ఎంటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌ (స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 27 May 2024 00:09 IST

ప్రవేశాలు
మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌  

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ).. పార్ట్‌టైమ్‌ విధానంలో ఎంటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌ (స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఎంటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు

సీట్లు: 30

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ. ఉర్దూ ఒక సబ్జెక్టుగా లేదా భాషగా 10/ 12/ డిగ్రీ స్థాయితో చదివి ఉండాలి. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30.

ఇంటర్వ్యూ తేదీ: జులై 29.

వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in/


సర్టిఫికెట్, డిప్లొమా, యూజీ 

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ...సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌ (హైదరాబాద్‌) సహకారంతో పార్ట్‌టైమ్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సర్టిఫికెట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: ఏడాది
  • సర్టిఫికెట్‌ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌: ఏడాది
  • డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: రెండేళ్లు
  • డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌: రెండేళ్లు
  • బీఎస్సీ ఇన్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: నాలుగేళ్లు 
  • బీఎస్సీ ఇన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌: నాలుగేళ్లు 
  • అర్హత: కనీసం 55% మార్కులతో ఇంటర్మీడియట్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు  చివరి తేదీ: జూన్‌ 30.

వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in/


నీట్‌/జేఈఈ రిపీటర్‌ కోర్సులు

నీట్‌/జేఈఈ మొదటి ప్రయత్నంలో విఫలమై.. మరోసారి సన్నద్ధమయ్యేవారి కోసం ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసస్‌ లిమిటెడ్‌ సంస్థ ‘రిపీటర్‌/ ట్వెల్త్‌ పాస్డ్‌’ కోర్సులను రూపొందించింది. వీటిలో బోధించే అధ్యాపకులకు అర్హతలు, అనుభవం మాత్రమే కాకుండా.. సుశిక్షిత బోధన పద్ధతులూ, నైపుణ్యాలు ఉంటాయనీ,  మారుతోన్న విద్యావసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా బోధిస్తారనీ సంస్థ తెలిపింది. కఠినంగా ఉన్న కాన్సెప్టులు కూడా ఉదాహరణలు, ఇలస్ట్రేషన్లతో సులభంగా అర్థమయ్యేలా నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ ఉంటుందనీ,  ప్రతిరోజూ టెస్ట్‌లను నిర్వహిస్తామనీ వివరించింది. దీనివల్ల తమ బలాలు, బలహీనతలను సమీక్షించుకుని.. విద్యార్థులు మెరుగుపరుచుకునే  అవకాశం ఉంటుంది. 

స్కాలర్‌షిప్‌: శిక్షణ తీసుకోవడానికి సాధారణంగా విద్యార్థులు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందులోనూ రెండోసారి కూడా శిక్షణ తీసుకోవాలంటే భారం మరింత పెరుగుతుంది. అందుకే ఆకాశ్‌ సంస్థ ‘ఇన్‌స్టెంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌’ను ఏర్పాటు చేసింది. దీంట్లో విజయం సాధిస్తే మొత్తంలో 90 శాతం స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంటుంది. నీట్‌/ జేఈఈ 2025కు సన్నద్ధమవుతూ.. మెడిసిన్‌/ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశించడానికి విద్యార్థులు ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలనూ పొందవచ్చు. 

వెబ్‌సైట్‌: www.aakash.ac.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని