బి.ఫార్మసీ పూర్తయ్యాక..?

బి.ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫార్మాలో పీజీ చేసినా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు దొరకవని విన్నాను. నిజమేనా? బి.ఫార్మసీ తరువాత బ్యాంకు, ఇతర ఉద్యోగాల పోటీపరీక్షలు రాద్దామనుకుంటున్నా...

Published : 12 Feb 2018 01:35 IST

బి.ఫార్మసీ పూర్తయ్యాక..?

‡‡‡ బి.ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫార్మాలో పీజీ చేసినా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు దొరకవని విన్నాను. నిజమేనా? బి.ఫార్మసీ తరువాత బ్యాంకు, ఇతర ఉద్యోగాల పోటీపరీక్షలు రాద్దామనుకుంటున్నా. నాకు అర్హత ఉంటుందా? లేదా బి.ఫార్మసీ పూర్తయ్యాక ఏ కోర్సులు ఎంచుకుంటే మేలో సూచించండి.

- ఎస్‌. రమేష్‌, రేపల్లె, గుంటూరు

జ: ఫార్మా కళాశాలలు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీనివల్ల బి.ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయన్నమాట కొంతవరకూ వాస్తవమే. కానీ ఫార్మా రంగం అభివృద్ధి, బహుళజాతి సంస్థలు మనదేశానికి రావడం ఫార్మా విద్యార్థులకు శుభపరిణామం. వీటివల్ల రిసెర్చ్‌ ఓరియెంటెడ్‌ ఉద్యోగావకాశాలు మెండుగానే ఉన్నాయి. విద్యార్థి తన డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో పరిశోధనాత్మకంగా విద్యను అభ్యసిస్తే ఉద్యోగాలను మంచి జీతంతో అందిపుచ్చుకోవచ్చు. బి.ఫార్మసీ చదివినవారు కూడా డిగ్రీ అర్హతగా ఉన్న బ్యాంకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మకోవిజిలెన్స్‌, మెడికల్‌ కోడింగ్‌ వంటి అదనపు కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు మెడికల్‌ స్టోర్‌ను స్థాపించుకుని, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టవచ్చు. కాబట్టి ఎక్కువగా మధ]నపడకుండా మీ కోర్సు వర్క్‌పై దృష్టిసారించండి.

ఫోరెన్సిక్‌కు అర్హత ఉందా?
‡‡‡ బీఎస్‌సీ (ఎంపీసీ) పూర్తిచేశాను. ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చేయాలనుంది. నేను అర్హుడినేనా? అందించే కళాశాలల వివరాలను తెలపండి.
- చందన్‌ రెడ్డి

 
జ: నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి, సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కొనే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లయిడ్‌ సైన్స్‌ లేదా వృక్ష శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసినవారికి ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు చేయడానికి మీరు అర్హులే. పీజీ స్థాయిలో ఈ కోర్సును అమిటి యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. పరిశీలన నైపుణ్యాలు, సహజంగా పరిశోధించే స్వభావం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వృత్తిలో రాణిస్తారు.

డేటాసైన్స్‌లో పరిశోధన
‡‡‡ ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. డేటా సైన్స్‌ లేదా మెషిన్‌ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ కోర్సు చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? విదేశాల్లో అందించే సంస్థలనూ తెలపండి.

- యాసాని చంద్రశేఖర్‌

జ: బిగ్‌ డేటా, సమాచార విప్లవంతో డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో పరిశోధన, ఉద్యోగావకాశాలకు గిరాకీ ఏర్పడింది. మనదేశంలో ప్రఖ్యాత ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐఎంలు ఈ విభాగంలో పరిశోధనకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా యూఎస్‌ఏలోని ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీ మెలన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు జీమ్యాట్‌, టోఫెల్‌, ఉద్యోగానుభవం ఆధారంగా చేసుకుని పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

లైబ్రరీ


కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, అకడమిక్‌, ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకాల వివరాలు.
నీట్‌-2018 
నీట్‌ -వృక్షశాస్త్రం 
పేజీలు: 688, ధర: రూ. 650 
ప్రచురణ: డార్క్‌చెర్రీస్‌ పబ్లికేషన్‌ 

డీఎస్సీ మ్యాథ్స్‌ 

డీఎస్సీ -స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథమెటిక్స్‌ 
కంటెంట్‌  పేజీలు: 544+496, వాల్యూమ్‌-1 ధర: రూ. 409, వాల్యూమ్‌-2 ధర: రూ. 379
ప్రచురణ: పీఆర్‌ పబ్లికేషన్స్‌ 

ఏపీ టెట్‌

  1) ఏపీటెట్‌ పేపర్‌-2 సాంఘికశాస్త్రం (కంటెంట్‌, పెడగోజీ) 
పేజీలు: 800, ధర: రూ. 360 
2) ఏపీటెట్‌ పేపర్‌-1 పరిసరాల విజ్ఞానం 
పేజీలు: 610, ధర: రూ. 270 
ప్రచురణ: వి.జి.యస్‌. కాంపిటీషన్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని