ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సు చేయాలంటే..?

ఇంటర్‌ తరువాత ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదవాలంటే ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకుంటే మంచిది? ఈ కోర్సు గురించిన పూర్తి సమాచారాన్ని అందించండి....

Published : 14 Jun 2018 02:22 IST

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సు చేయాలంటే..?

*ఇంటర్‌ తరువాత ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదవాలంటే ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకుంటే మంచిది? ఈ కోర్సు గురించిన పూర్తి సమాచారాన్ని అందించండి.

- రాజు.పి, జై, వైవీఎన్‌ఎం సత్యనారాయణ

పర్యావరణ భౌతిక, రసాయన, జీవ సంబంధిత భాగాలను పరస్పరం అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రమే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌. ఇది జీవ, రసాయనిక, భూగోళశాస్త్రాల కలయిక. అందుకే దీన్ని ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌గా పరిగణిస్తారు. ఈ శాస్త్రం సాంఘిక, మానవీయ శాస్త్రాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. బీఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) మాత్రమే కాకుండా ఈ రంగంలో బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌)ను కూడా ఇంటర్‌ తరువాత ఎంచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంపీసీ/ బైపీసీ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ కోర్సుల్లో చేరాలంటే ఎంపీసీ ఎంచుకోవడం మంచిది. జీవశాస్త్ర కలయిక కోసం బైపీసీ ఎంచుకోవడం శ్రేయస్కరం. బీఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) లేదా బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌) రెండింటికీ కూడా చక్కని భవిష్యత్తు ఉంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఐఐటీ-ఖాన్‌పూర్‌, ఐఐటీ-దిల్లీ, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ-బాంబేల్లో బీటెక్‌లో ఈ కోర్సును అందిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌సీ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ను ఆల్‌ అమీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- రాజమండ్రి, శ్రీ గ్రంథి చిన సన్యాసి రాజు కాలేజ్‌- శ్రీకాకుళం, హోమ్‌సైన్స్‌ కాలేజ్‌- హైదరాబాద్‌, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌- హైదరాబాద్‌, ఆంధ్రా, కాకతీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని