దూరవిద్యలో పీహెచ్‌డీ కుదరదా?

బీటెక్‌ పూర్తిచేసి, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాను. దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తిచేశాను. పీహెచ్‌డీ కూడా దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను.

Published : 14 Aug 2018 01:49 IST

దూరవిద్యలో పీహెచ్‌డీ కుదరదా?

ప్రశ్న: బీటెక్‌ పూర్తిచేసి, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాను. దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తిచేశాను. పీహెచ్‌డీ కూడా దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? అందించే సంస్థలేవి?

- రాహుల్‌

దూరవిద్యలో పీహెచ్‌డీ ప్రవేశాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వారు పూర్తిగా నిలిపివేశారు. ఇటువంటి డిగ్రీలను ఎవరైనా అందించినా అవి చెల్లవు. కాబట్టి ఏదైనా యూనివర్సిటీ లేదా సంస్థ దూరవిద్యలో పీహెచ్‌డీ అందిస్తానంటే మోసపోకండి. పీహెచ్‌డీ విద్యను పుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ విధానంలో మాత్రమే అందిస్తారు.


బీటెక్‌ తర్వాత అదనంగా...

ప్రశ్న: బీటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తి చేశాను. అదనంగా కోర్సులు చేయాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలను అందించే కొత్త కోర్సుల వివరాలను తెలపండి

- లలిత

ముందుగా మీరు ఏ రంగంలో అడుగెడదామనుకుంటున్నారో నిర్ణయించుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే వివిధ అవకాశాలు డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, ఆటోమేషన్‌ విభాగాల్లో ఉన్నాయి. మీరు ఎంచుకున్న విభాగాన్ని బట్టి షార్ట్‌ టర్మ్‌ కోర్సులను ఎంచుకోవాలి. ఉదాహరణకు టెస్టింగ్‌లో సెలీనియం, ఆటోమేషన్‌కు దీనిజువీశిళీ కోర్సులను ఎంచుకోవచ్చు.
డేటా అనలటిక్స్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే DEVOPS ప్రోగ్రామింగ్‌, PYTHON, SAS తో పాటుగా స్టాటిస్టిక్స్‌పై పట్టు సాధించాలి. ఈ విధంగా మీరు నచ్చిన కోర్సును ఎంచుకుని ఉద్యోగాన్ని సాధించవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని