Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు IBPS నోటిఫికేషన్ విడుదల!
దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే నియామక పరీక్షకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదలైంది.
దిల్లీ: బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్! దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ వచ్చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XIII (CRP)ల ద్వారా గ్రూప్ ‘ఎ’ ఆఫీసర్స్ (స్కేల్ -1, II & III), గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి జూన్ 7 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఐబీపీఎస్ తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. అయితే, ఎన్ని పోస్టుల్ని భర్తీ చేస్తారనే విషయాన్ని మాత్రం నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఈ పోస్టులకు విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు చేసుకొనే విధానం, ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వేతనం, పరీక్ష కేంద్రాలు తదితర వివరాలతో సవివరమైన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని https://www.ibps.in/ పేర్కొంది.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ షెడ్యూల్...
- దరఖాస్తుల స్వీకరణ: జూన్ 7 నుంచి జూన్ 27 వరకు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్(PET): జులై 22 నుంచి 27 వరకు
- ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ఆన్లైన్ పరీక్ష ఆగస్టులో నిర్వహిస్తారు.
- ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆగస్టు/సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు.
- మెయిన్/సింగిల్ ఆన్లైన్ పరీక్షను సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
- ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఆన్లైన్ లేదా ఫిజికల్ మోడ్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యేముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్