Notifications: నోటిఫికేషన్స్‌

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రిసెర్చ్‌ (సీఐసీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి, యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖిఖి, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 24 May 2024 01:13 IST

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రిసెర్చ్‌

హారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రిసెర్చ్‌ (సీఐసీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి, యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖిఖి, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు 26. ఇంటర్వ్యూ తేదీలు: 2024, మే 27, 28, 29.


మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్‌ విధానంలో ఎంటెక్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌ (స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్‌ 2024.


సర్టిఫికెట్, డిప్లొమా, యూజీ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌ (హైదరాబాద్‌) సహకారంతో పార్ట్‌టైమ్‌ ప్రాతిపదికన ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30 జూన్‌ 2024.


ప్రాజెక్ట్‌ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్స్, ప్రాజెక్ట్‌ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-సీ, ప్రాజెక్ట్‌ ల్యాబ్‌ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు 11. ఆసక్తి ఉన్నవారు 2024 మే 30న ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు