NIFT Exam Results: నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు ఇదిగో!

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్థల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 21 Mar 2024 15:00 IST

దిల్లీ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT)లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 60 నగరాల్లోని  72 సెంటర్లలో ఫిబ్రవరి 5న నిర్వహించిన ఈ పరీక్ష స్కోరు కార్డులను ఎన్‌టీఏ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రవేశపరీక్ష తర్వాత ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ.. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. ఆ తర్వాత నిపుణులతో వెరిఫై చేసిన అనంతరం ఫైనల్‌ కీతో పాటు తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను https://exams.nta.ac.in/NIFT/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

రైల్వేలో కొలువుల జాతర.. మరో జాబ్‌ నోటిఫికేషన్ వచ్చేస్తోంది!

బి.ఎఫ్‌.టెక్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మరోవైపు, ఎన్‌ఐఎఫ్‌టీల్లో మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌ (మాస్టర్‌ ఆఫ్‌డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి 6 వరకు దిల్లీలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొంది.  పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించింది.  ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్‌ డెస్క్‌ 011-40759000 నంబర్‌,  లేదా nift@nta.ac.in ద్వారా తెలపవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని