APMS: ఇంటర్‌లో చేరతారా? ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

Published : 22 Mar 2024 19:23 IST

అమరావతి: ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 162 మోడల్ స్కూల్స్‌లో ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ/సీఈసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల రీషెడ్యూల్‌.. కొత్త డేట్స్‌ ఇవే..

ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన ఉంటుందని కమిషనర్‌ స్పష్టం చేశారు. వీటిలో విద్యనభ్యసించేందుకు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని తెలిపారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ₹200; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు ₹150 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించి  https://apms.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత   జిల్లా విద్యాశాఖ అధికారి/మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు