IITM: వాతావరణ సంస్థలో ప్రాజెక్ట్ పోస్టులు
పుణెలోని భారత ఉష్ణ మండల వాతావరణ విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన 65 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పుణెలోని భారత ఉష్ణ మండల వాతావరణ విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన 65 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హతలు, నెట్/ సీఎస్ఐఆర్ - యూజీసీ/ గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటీయరాలజీ (ఐఐటీఎం) ప్రకటించిన ఈ పోస్టులకు జూన్ 18, 2024 నాటికి తగిన అర్హతలున్నవారు దరఖాస్తు చేయాలి.
జేఈఈ ‘అడ్వాన్స్డ్’ ముగిసింది.. దేశంలో టాప్ ఐఐటీ, ఎన్ఐటీలు ఇవే..
- విద్యార్హతల, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- వైద్య పరీక్షల్లో అర్హత సాధించినవారిని విధుల్లోకి తీసుకుంటారు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీలకు టీఏ/డీఏలను చెల్లిస్తారు. ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు సొంతంగా రవాణా, వసతి ఏర్పాట్లు చేసుకోవాలి.
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-3: 4.మీటీయరాలజీ/ ఓషనోగ్రఫీ/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఎర్త్ సైన్సెస్/ క్లైమేట్ సైన్సెస్/ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి లేదా ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు. ఏడేళ్ల పరిశోధనానుభవం ఉండాలి.
- మోడల్ కోడ్ హ్యాండ్లింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అనుభవాన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్/ పబ్లికేషన్స్ ఆధారంగా పరిగణిస్తారు.
- ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్-2: 11.ఫిజిక్స్/ జియాలజీ/ ఎర్త్ సైన్స్/ జియోఫిజిక్స్/ అనలిటికల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
కొలువు కొట్టాలంటే.. ఈ నైపుణ్యాలు కావాల్సిందే..!!
- ఎంఎస్-ఆఫీస్ పరిజ్ఞానం, మూడేళ్ల అనుభవం ఉండాలి.
- జియోకెమికల్ అనలిటికల్ టెక్నిక్స్, అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ నిర్వహణ తెలిసినవారికి ప్రాధాన్యమిస్తారు.
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 4.ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ అట్మాస్ఫియరిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఈఈఈ/ ఈఅండ్టీలో ఇంజినీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
సైన్స్‌లో డాక్టరల్ డిగ్రీ/ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారికీ, సంబంధిత ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
4. ట్రెయినింగ్ కోఆర్డినేటర్: 1. మాస్టర్స్ డిగ్రీ చేసి.. గవర్నమెంట్/ సీఎస్యూల్లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్/ పర్సనల్ మేనేజ్మెంట్/ లేబర్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా చేసినవారికి, సూపర్వైజర్ స్థాయిలో మూడేళ్లు పనిచేసినవారికి, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సమావేశాలను సమన్వయం చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
5. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 2. ఫిజిక్స్/ మీటీయరాలజీ/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ/ ఎంటెక్ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 40 ఏళ్లు.
- ఇండస్ట్రియల్/ అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్/ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్లోని రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
- అట్మాస్ఫియరిక్ ఇన్స్ట్రుమెంట్స్, డేటా అక్విజిషన్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.
6. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 8. ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ మీటీయరాలజీ/ ఓషనోగ్రఫీ/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఎర్త్ సైన్సెస్/ క్లైమేట్ సైన్సెస్/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 ఏళ్లు.
- ఎర్త్ సిస్టమ్ మోడలింగ్/ క్లైమేట్ మోడలింగ్‌లో రెండేళ్ల పరిశోధనానుభవం ఉండాలి.
- సైంటిఫిక్ రిపోర్ట్స్/ పబ్లికేషన్స్ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు.
- ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉండి.. ప్రముఖ సంస్థల్లో పనిచేసినవారికి ప్రాధాన్యం.
7. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 33. ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ మీటీయరాలజీ, ఓషనోగ్రఫీ/ క్లైమేట్ సైన్స్/ జియోఫిజిక్స్/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
రుతుపవనాలు, వాటి వైవిధ్యాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
8. రిసెర్చ్ అసోసియేట్ (డీప్ ఓషన్ మిషన్)-2: మీటీయరాలజీ/ అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఎర్త్ సైన్సెస్/ క్లైమేట్ సైన్సెస్/ ఓషనోగ్రఫీ/ ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ. లేదా ఎంటెక్ చదివిన తర్వాత మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
- సైంటిఫిక్ రిపోర్ట్స్/ పబ్లికేషన్స్ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు.
- ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.
- ఏఐ/ఎంఎల్ టెక్నిక్స్‌లో అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2024
వెబ్సైట్: http://www.tropmet.res.in/Careers
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్‌బీర్