APPLY NOW: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1025 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 25వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 07 Feb 2024 15:45 IST

PNB Recruitment 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌:  బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఈ వెబ్‌సైట్‌ https://www.pnbindia.in/Recruitments.aspx ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

రైల్వేలో మరో 9,000 ఉద్యోగాలు.. వివరాలివిగో!

నోటిఫికేషన్‌లో కొన్ని వివరాలివే.. 

  • మొత్తం 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. వీటిలో ఆఫీసర్‌ -క్రెడిట్‌ (జేఎంబీ స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు  1000 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.36,000- 63,840వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, మేనేజర్‌ -ఫోరెక్స్‌ (ఎంఎంజీ స్కేల్‌ -II) 15 పోస్టులు ఉండగా.. వేతనం రూ.48,170 - రూ.69,810;  మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్‌ -II) పోస్టులు 5 ఉండగా.. రూ.48,170 - 69,810; సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ (ఎంఎంజే స్కేల్‌ -III) 5 పోస్టులు ఉండగా.. రూ. 63,840 - 78,230 వరకు వేతనం చెల్లిస్తారు. ఇతర సౌకర్యాలు వీటికి అదనం. 
  • వయో పరిమితి: ఆఫీసర్‌ (క్రెడిట్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు జనవరి 1, 2024 నాటికి 21-28 ఏళ్లు మించరాదు. మేనేజర్‌ పోస్టులకైతే 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో సడలింపు అవకాశం ఉంది.
  • విద్యార్హత: ఉద్యోగ ఖాళీలను అనుసరించి సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ /బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, ఉత్తీర్ణతతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు బాండ్‌ రాయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹59, మిగతా అభ్యర్థులకు ₹1180.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం https://www.pnbindia.in/Recruitments.aspx క్లిక్‌ చేయండి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని