Railway Jobs: రైల్వేలో మరో 9,000 ఉద్యోగాలు.. వివరాలివిగో!

రైల్వేలో అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న రైల్వే శాఖ.. త్వరలో మరో 9వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.

Published : 01 Feb 2024 17:11 IST

Railway Jobs Recruitment | దిల్లీ: ఇటీవల 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలకు (ALP Job Recruitment) దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వే శాఖ.. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేయనుంది. దాదాపు 9 వేల రైల్వే టెక్నీషియన్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీస్‌ను ఆర్‌ఆర్‌బీ - భోపాల్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 21 ఆర్‌ఆర్‌బీల పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నోటీస్‌ కోసం క్లిక్‌ చేయండి

రైల్వేలో 5,696 ఉద్యోగాలకు వయో పరిమితిలో మార్పు.. పరీక్షల టైం లైన్‌ ఇదే..!

మార్చి - ఏప్రిల్‌లో అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్‌ - డిసెంబర్‌ మధ్య కాలంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రకటిస్తారు. టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వేతనం, వయో పరిమితి, దరఖాస్తు తేదీలు, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్‌ వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుస్తాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని