Railway Jobs: రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

రైల్వేలో 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు మరో 6 రోజుల్లో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

Published : 02 Apr 2024 16:01 IST

Railway Jobs Recruitment | దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతోన్న అభ్యర్థులకు అలర్ట్‌..  రైల్వే మంత్రిత్వశాఖలో 9,144 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగియనుంది.  అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 8వ తేదీ రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు ఇవే..

  • పోస్టుల వివరాలు: మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలు 8,052
  • వయో పరిమితి:  జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్‌ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు. 
  • దరఖాస్తు రుసుం రూ.500. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ.400 రిఫండ్‌ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మహిళలు/థర్డ్‌జెండర్‌/మైనార్టీలు/ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. 
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. 
  • వేతనం: టెక్నీషియన్‌ గ్రేడ్‌ -1 సిగ్నల్‌ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్‌-5 కింద ప్రారంభ వేతనంగా రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్‌ -3 పోస్టులకు లెవెల్‌ -2 కింద ₹19,990 చొప్పున చెల్లిస్తారు.
  • టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్‌, సిలబస్‌ తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు