Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. 2024 జాబ్‌ క్యాలెండర్‌ ఇదే..

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

Updated : 04 Feb 2024 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వేల్లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా 2024లో భర్తీ చేయనున్న ఉద్యోగ వివరాలను వెల్లడించింది. ఇప్పటికే అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న రైల్వే శాఖ.. త్వరలోనే దాదాపు 9,000 టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది. వీటితో పాటు ఈ ఏడాదిలో ఎన్టీపీసీ, ఇతర పోస్టులకు విడుదల చేయనున్న నోటిఫికేషన్ల వివరాలివే.. 

  • జనవరి - మార్చి - అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాలు
  • ఏప్రిల్‌ - జూన్‌ - రైల్వే టెక్నీషియన్‌ పోస్టులు

జులై - సెప్టెంబర్‌ మాసాల్లో 

 - నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (NTPC) గ్రాడ్యుయేట్‌ (లెవెల్‌ 4,5,6)

 - నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (లెవెల్‌ 2 & 3) పోస్టులు

 - జూనియర్‌ ఇంజినీర్‌ ; పారామెడికల్‌ కేటగిరీ పోస్టులు

  • అక్టోబర్‌ -డిసెంబర్‌ నెలల్లో లెవెల్‌ -1, మినిస్టీరియల్‌ & ఐసోలేటేడ్‌ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు