SSC: డిప్లొమా/బీటెక్‌ చేశారా? ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి: ఎస్‌ఎస్‌సీ అలర్ట్‌

జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఎస్‌ఎస్‌సీ తేల్చి చెప్పింది.

Updated : 15 Apr 2024 23:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకొనే అభ్యర్థులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఓ అలర్ట్‌ జారీ చేసింది. మొత్తం 968 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 18తో ముగియనున్నందున.. త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. చివరి వరకు ఆగితే సర్వర్‌పై భారం, ఇతర సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చని అప్రమత్తం చేసింది. అప్లికేషన్ల స్వీకరణ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అందువల్ల డిప్లొమా లేదా బీటెక్‌ పూర్తి చేసి ఈ పోస్టుల పట్ల ఆసక్తికలిగిన వారు ఈ లింక్‌పై క్లిక్‌ చేసి త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

  • అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.
  • గరిష్ఠ వయో పరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు - 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉంటాయి.
  • ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జీత భత్యాలు: రూ.35,400- రూ.1,12,400.
  • దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)
  • పరీక్షలు సీబీటీ విధానంలో ఉంటాయి. పేపర్‌ 1 పరీక్ష జూన్‌ 4 నుంచి 6వరకు నిర్వహిస్తారు.
  • పేపర్‌ -2 పరీక్ష తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.

ఉద్యోగ ఖాళీల వివరాలు, పరీక్ష విధానం, సిలబస్‌, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని