SSC: 7500 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్ష.. అడ్మిట్‌ కార్డులు విడుదల

కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వశాఖల్లో 7500 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Published : 11 Jul 2023 14:51 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. జులై 14 నుంచి 27వరకు కంప్యూటర్‌ ఆధారిత టైర్‌-1 పరీక్షలు జరగనుండటంతో అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్‌ 3 నుంచి మే 3వరకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

 టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్న విషయం తెలిసిందే.

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని