SSC: ఎస్‌ఎస్‌సీ కీలక ప్రకటన.. పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా

ఎన్నికల నేపథ్యంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలను ఎస్‌ఎస్‌సీ వాయిదా వేసింది. కొత్త తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 

Updated : 08 Apr 2024 15:13 IST

Staff Selection Commission | దిల్లీ: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు వివిధ దశల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పలు పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ ఎస్‌ఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న పరీక్ష తేదీలకు బదులుగా కొత్త తేదీలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది.

  • జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, క్వాంటిటీ సర్వేయింగ్‌, కాంటాక్ట్స్‌) పరీక్ష పేపర్‌ 1.. జూన్‌ 4, 5, 6 తేదీల్లో జరగాల్సిఉండగా.. వాటిని జూన్‌ 5, 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • సెలక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ - ఫేజ్‌ XII, 2024 (పేపర్‌ 1) పరీక్ష  మే 6, 7, 8 జరగాల్సిఉండగా.. జూన్‌ 24, 25, 26 తేదీలకు మార్పు చేశారు. 
  • దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్ష (పేపర్‌ 1 పరీక్ష మే 9, 10, 13 తేదీల్లో జరగాల్సిఉండగా.. దీన్ని జూన్‌ 27, 28, 29 తేదీలకు వాయిదా వేశారు. 
  • కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ (10+2) లెవెల్‌ ఎగ్జామినేషన్‌కు తేదీలను ఖరారు చేశారు. ఈ పరీక్షను జులై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ పేర్కొంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని