TSPSC: గ్రూప్‌ 1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ వచ్చేసింది..

తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 19 Feb 2024 20:56 IST

TSPSC Group 1 Jobs Recruitment | హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ (Group 1 Notification 2024 Telangana) విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష; సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10గంటల నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరిచేసుకోవచ్చు. పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు నుంచి హాల్‌టిక్కెట్లు అందుబాటులోకి తెస్తారు. 

గతంలో దరఖాస్తు చేసినా ఈ నోటిఫికేషన్‌లో పోస్టులకు మళ్లీ చేసుకోవాల్సిందేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది. జోన్‌లవారీగా పోస్టుల వివరాలు, పరీక్ష సిలబస్‌ తదితర పూర్తి వివరాలు ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే... 

  • డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు): వయస్సు 18 నుంచి 46 ఏళ్లు - వేతనం రూ.58,850 - రూ.1,37,050
  • డీఎస్పీ (115 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.58,850 -రూ.1,37,050
  • సీటీవో (48 పోస్టులు): 18 - 46ఏళ్లు - వేతనం రూ.58, 850 -రూ.1,37,050
  • ఆర్టీవో (4 పోస్టులు): 21 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630
  • జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630
  • జిల్లా రిజిస్ట్రార్‌ (6 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630
  • జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు): 18 - 35 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630
  • సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630
  • అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (30 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు (3 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630
  • జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (2 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630
  • జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (20 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (38 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌  (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310
  • ఎంపీడీవో  (140 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని