TSPSC Group 1 Exams: గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు

తెలంగాణలో గ్రూప్‌ 1 ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారైంది. జూన్‌ 9న పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 

Updated : 26 Feb 2024 20:55 IST

TSPSC Group 1 prelims Exam date | హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని