TTD: భారీగా వేతనం.. తితిదే కాలేజీల్లో జేఎల్‌ పోస్టులకు దరఖాస్తులు షురూ

తితిదే ఆధ్వర్యంలో నడిచే జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. 

Updated : 05 Mar 2024 19:07 IST

తిరుమల: తిరుపతిలోని తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే పలు విద్యా సంస్థల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ (Job Notifications) విడుదలైన విషయం తెలిసిందే. తితిదేకు చెందిన వివిధ డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్‌ కాలేజీల్లో 49 లెక్చరర్ల పోస్టులు; తితిదే జూనియర్‌ కాలేజీల్లో 29 జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన APPSC ఆధ్వర్యంలో నియమించనున్నారు. అయితే, తొలుత జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నేటినుంచి (మార్చి5) ఆన్‌లైన్‌ దరఖాస్తులు మొదలయ్యాయి. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు 8 నుంచి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏపీపీఎస్సీ (APPSC) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
  • జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి మార్చి 25 అర్ధరాత్రి 11.9గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయో పరిమితి: జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఇచ్చారు.
  • జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మాస్టర్స్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
  • ఈ పోస్టులకు సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్‌- 4, కామర్స్‌- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్‌- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 చొప్పున మొత్తం 29 పోస్టులు ఉన్నాయి.
  • డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మంచి అకడమిక్‌ రికార్డుతో పాటు 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు నెట్‌/స్లెట్‌ అర్హత తప్పనిసరి. 
  • సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టుల చొప్పున ఉన్నాయి.
  • దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకైతే రూ.370.
  • వేతనం: జూనియర్ లెక్చరర్లకు రూ.57,100- రూ.1,47,760; డిగ్రీ లెక్చరర్లకు రూ.61,960- రూ.1,51,370 చొప్పున నెలవారీ వేతనం అందజేస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జేఎల్‌ పోస్టులకు దరఖాస్తు కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని