UGC: ఆ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు ఉండదు: యూజీసీ ఛైర్మన్‌

సీయూఈటీ (యూజీ) పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

Published : 18 Mar 2024 00:12 IST

దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష-యూజీ (CUET UG 2024)షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని యూజీసీ (UGC) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన మాదిరిగా మే 15 నుంచి 31 మధ్యే ఈ పరీక్షలు జరుగుతాయని యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌ అన్నారు.  CUET 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని.. రిజిస్ట్రేషన్లు ముగిశాక స్పష్టమైన డేట్‌ షీట్‌ను NTA విడుదల చేస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీయూఈటీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు ఉండొచ్చంటూ గతంలో చెప్పిన విషయంపై తాజాగా ఆయన ట్వీట్‌ చేశారు.

భారీగా జీతం.. ‘నవోదయ’లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన

‘సీయూఈటీ - యూజీ పరీక్షలు ఎన్‌టీఏ గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌  ప్రకారమే (మే 15 నుంచి 31వరకు) జరుగుతాయి. ఈ షెడ్యూల్‌లోని రెండు తేదీల్లో (మే  20, 25) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 26న సీయూఈటీ (యూజీ) దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత అసలు ఎంతమంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు? ప్రాంతాల వారీగా ఎంతమంది ఉన్నారనే డేటా, పరీక్ష తేదీల ఆధారంగా ఎన్‌టీఏ డేట్‌ షీట్‌ను రూపొందించి విడుదల చేస్తుంది’ అని యూజీసీ చీఫ్‌ పేర్కొన్నారు. గతేడాది 14.9లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని