APPLY NOW: 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ..

దేశంలోని ఈఎస్‌ఐలలో పని చేసేందుకు నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించింది.

Published : 08 Mar 2024 16:26 IST

UPSC Nursing Officer Recruitment | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈఎస్‌ఐసీల్లో పని చేసేందుకు నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 27 వరకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://upsconline.nic.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • అర్హతలివే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్). బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది కాలం పని చేసిన అనుభవం ఉండాలి.
  • వయో పరిమితి: 27-03-2024 నాటికి అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 18-30 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు; దివ్యాంగులకు 40 ఏళ్లు మించొద్దు. 
  • దరఖాస్తు ఫీజు : రూ.25. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. 
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా 
  • జులై 7న పెన్ను, పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ పరీక్ష. ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. రెండు గంటల పాటు ఉండే ఈ పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 మైనస్‌ మార్కులు ఉంటాయి. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
  • వేతనం: లెవెల్‌ -7 పే కింద చెల్లిస్తారు.
  • ఉద్యోగానికి ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని