ఐస్‌క్రీమ్‌తో తలనొప్పి!

ఆశ్చర్యంగా అనిపించినా ఐస్‌క్రీమ్‌ తింటే కొన్నిసార్లు తలనొప్పి రావొచ్చు. చల్లటి ఐస్‌ క్రీమ్‌ నోట్లో అంగిలిని తాకినప్పుడు నాడులు ప్రేరేపితమవుతాయి.

Published : 11 Jun 2024 00:16 IST

ఆశ్చర్యంగా అనిపించినా ఐస్‌క్రీమ్‌ తింటే కొన్నిసార్లు తలనొప్పి రావొచ్చు. చల్లటి ఐస్‌ క్రీమ్‌ నోట్లో అంగిలిని తాకినప్పుడు నాడులు ప్రేరేపితమవుతాయి. రక్తనాళాలు ఉబ్బుతాయి. ఫలితంగా లోపలేదో పొడుస్తున్నట్టు తలనొప్పి పుడుతుంది. ఇదేమీ ఇబ్బందికరమైంది కాదు. ఐస్‌క్రీమ్‌తోనే కాకుండా చాలా చల్లగా ఉండే పండ్ల రసాలు, నీరు తాగినా ఇలాంటి తలనొప్పి పుడుతుంది. మరి దీన్ని నివారించుకోవటమెలా? ఐస్‌క్రీమ్‌ మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకోకుండా చాలా నెమ్మదిగా, ఆస్వాదిస్తూ తినటం ద్వారా తలనొప్పిని నివారించుకోవచ్చు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని