ఏకాగ్రతకు నాలుగు సూత్రాలు

వయసు మీద పడుతున్నకొద్దీ ఏకాగ్రత కొరవడుతుంటుంది. సమాచారాన్ని త్వరగా గ్రహించటం ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో చివరికి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో ఏకాగ్రత కొరవడకుండా చూసుకోవచ్చు.

Published : 23 Aug 2016 01:58 IST

ఏకాగ్రతకు నాలుగు సూత్రాలు

వయసు మీద పడుతున్నకొద్దీ ఏకాగ్రత కొరవడుతుంటుంది. సమాచారాన్ని త్వరగా గ్రహించటం ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో చివరికి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో ఏకాగ్రత కొరవడకుండా చూసుకోవచ్చు.

** ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వారి వంక చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఏదైనా విషయం అర్థం కాకపోతే మరోసారి చెప్పమని గానీ నెమ్మదిగా మాట్లాడాలని గానీ అడగాలి.

** ఆయా విషయాలను అర్థం చేసుకోవటం, వాటిని మళ్లీ మననం చేసుకోవటం జ్ఞాపకశక్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ‘రాత్రి 8 గంటలకు హోటల్‌లో గానీ 9.30కు దాబాలో గానీ భోజనం చేద్దాం’ అని ఎవరైనా ఆహ్వానిస్తే.. ‘8 గంటలకు హోటల్‌లో కలుద్దామా? 9.30కు దాబాలోనా?’ అని అడిగితే బాగా గుర్తుంటుంది.

** ఇతర విషయాలపై మనసు మళ్లకుండా ప్రశాంతంగా ఉండే చోట మాట్లాడేందుకు ప్రయత్నించాలి. గందరగోళంగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లకు బదులు ఇంట్లో కలుసుకోవచ్చు. హోటల్‌లోనే కలుసుకునేట్టయితే గోడకు ఆనుకున్న కుర్చీలో కూచోవటం మంచిది. మీతో మాట్లాడే వ్యక్తి వీపు గోడ వైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో అటూఇటూ వెళ్లేవారిపై దృష్టి మళ్లకుండా ఉంటుంది.

** ఒకేసారి రెండు మూడు కాకుండా ఒకే పనిని చేయటం ఉత్తమం. దీంతో మనసు దాని మీదే లగ్నమవుతుంది. ఉదాహరణకు మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. చదవటం పూర్తయ్యాకే చేస్తానని చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని