శృంగారంగా కేలరీల ఖర్చు!

ఒకవైపు ఆనందం.. మరోవైపు కేలరీల ఖర్చు! అదెలా అని ఆశ్చర్యపోకండి. శృంగారంతో సాధ్యమేనని అధ్యయనాలు...

Published : 12 Sep 2017 01:17 IST

శృంగారంగా కేలరీల ఖర్చు!

కవైపు ఆనందం.. మరోవైపు కేలరీల ఖర్చు! అదెలా అని ఆశ్చర్యపోకండి. శృంగారంతో సాధ్యమేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి! వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడూ కేలరీలు ఖర్చు అవుతాయి మరి. సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరుగెత్తితే సగటున మహిళల్లో 213 కేలరీలు, పురుషుల్లో 276 కేలరీలు ఖర్చు కాగా.. శృంగారం మూలంగా మహిళల్లో 69 కేలరీలు, పురుషుల్లో 101 కేలరీలు ఖర్చు కావటం గమనార్హం. మగవారిలో ఎక్కువ కేలరీలు ఎందుకు ఖర్చవుతున్నాయో తెలుసా? ఆడవాళ్ల కన్నా మగవాళ్లు ఎక్కువ బరువు ఉండటం.. ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగానూ ఉండటం వల్లనేనని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి శృంగారమనేది వ్యాయామపద్ధతి కాదు గానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండటం విశేషం. కేలరీల విషయం పక్కనపెట్టి చూసినా.. శృంగారంతో మానసిక ఆరోగ్యం, మూడ్‌ మెరుగుపడతాయి. కండరాలను వదులుచేసే, హాయిని కలిగించే రసాయనాలు శరీరమంతా సరఫరా అవుతాయి. అంతేకాదు.. నిద్ర కూడా బాగా పడుతుంది. అంటే శృంగారం.. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ పెంపొందించే సాధనం కూడా అన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని