వ్యాయామ సైకిల్‌ భేష్‌!

ఉదయం పూట నడక, జాగింగ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరికి ఉదయాన్నే...

Published : 21 Feb 2017 02:04 IST

వ్యాయామ సైకిల్‌ భేష్‌!

దయం పూట నడక, జాగింగ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరికి ఉదయాన్నే బయటకు వెళ్లటానికి సమయం దొరకదు. ఇలాంటివారు వ్యాయామ సైకిల్‌ తొక్కటం మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తూ గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తటం, ఆరుబయట సైకిల్‌ తొక్కటం కన్నా ఇది ఎంతో సురక్షితం. దీంతో కీళ్లు కూడా పెద్దగా దెబ్బతినవు. ముఖ్యంగా వ్యాయామాలు ఆరంభించేవారికిది చాలా అనువైంది. వెన్ను, మోకాలు, కీళ్ల సమస్యలతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల సేపు తొక్కితే తగినంత శారీరక శ్రమ చేసిన ఫలితం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని