సంతానానికీ ‘ఒమేగా’!

కొవ్వు అనగానే చాలామంది చెడ్డదనే భావిస్తుంటారు. కానీ ప్రోటీన్‌, పిండి పదార్థంతో పాటు ఇది కూడా...

Published : 25 Oct 2016 01:43 IST

సంతానానికీ ‘ఒమేగా’!

కొవ్వు అనగానే చాలామంది చెడ్డదనే భావిస్తుంటారు. కానీ ప్రోటీన్‌, పిండి పదార్థంతో పాటు ఇది కూడా కీలకమైన సూక్ష్మ పోషకమే. ఇది మన శరీరంలో రకరకాల పనులకు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఆహారంలో తగినంత కొవ్వు కూడా ఉండేలా చూసుకోవటం అవసరం. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్‌ వంటి చేపలు, అవిసె గింజల వంటి వాటితో లభించే ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఒంట్లో వాపు ప్రక్రియను తగ్గిస్తాయి. ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సంతాన అవకాశాలనూ పెంపొందిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇవి అండాల నిల్వ, అండాల నాణ్యత పెరగటానికి దోహదం చేస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని