థర్మామీటర్‌ ఎంతసేపు?

జ్వరం వచ్చినపుడు థర్మామీటర్‌తో కొలిచి జ్వరం తీవ్రతను తెలుసుకుంటాం. కానీ చాలామందికి దీన్ని ఎంతసేపు నాలుక కింద పెట్టుకోవాలో తెలియదు.

Published : 14 Feb 2017 02:04 IST

థర్మామీటర్‌ ఎంతసేపు?

జ్వరం వచ్చినపుడు థర్మామీటర్‌తో కొలిచి జ్వరం తీవ్రతను తెలుసుకుంటాం. కానీ చాలామందికి దీన్ని ఎంతసేపు నాలుక కింద పెట్టుకోవాలో తెలియదు. గాజు థర్మామీటరైతే మూడు నిమిషాల సేపు నాలుక కింద ఉంచుకుంటే జ్వరం తీవ్రత కచ్చితంగా బయటపడుతుంది. ప్రస్తుతం డిజిటల్‌ థర్మామీటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటినైతే ‘బీప్‌’ చప్పుడు వచ్చేంతవరకు నాలుక కింద పెట్టుకోవాలి. డిజిటల్‌ థర్మామీటర్లను వినియోగించటం తేలిక. ఫలితం కూడా త్వరగా తెలుస్తుంది. అందుకే గాజు థర్మామీటర్ల కన్నా డిజిటల్‌ థర్మామీటర్లు వాడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గాజు థర్మామీటరును నోట్లో పెడితే పిల్లలు కొరికే ప్రమాదముంది. దీంతో దానిలోని పాదరసం బయటకు వచ్చి, పిల్లలు మింగే ప్రమాదముంది. కాబట్టి పిల్లల విషయంలో గాజు థర్మామీటరు వాడకపోవడమే ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని