కోపాన్ని చల్లార్చండి!

కోపాన్ని అణచుకోలేకపోతున్నారా? అయితే కాస్త వెడల్పయిన గిన్నెలో బాగా చల్లగా ఉన్న నీళ్లు పోసి.. అందులో 30 సెకండ్ల పాటు చేతులను గానీ ముఖాన్ని గానీ ముంచి బయటకు తీయండి. విచిత్రంగా అనిపించినా ఇది తక్షణం కోపం, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది....

Published : 28 Nov 2017 02:09 IST

కోపాన్ని చల్లార్చండి!

కోపాన్ని అణచుకోలేకపోతున్నారా? అయితే కాస్త వెడల్పయిన గిన్నెలో బాగా చల్లగా ఉన్న నీళ్లు పోసి.. అందులో 30 సెకండ్ల పాటు చేతులను గానీ ముఖాన్ని గానీ ముంచి బయటకు తీయండి. విచిత్రంగా అనిపించినా ఇది తక్షణం కోపం, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. మనసును స్థిమితపరచి ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంది. వ్యక్తిత్వ సమస్యలతో సతమతమయ్యేవారికోసం రూపొందించిన డీబీటీ- డయలెక్టికల్‌ బిహేవియర్‌ థెరపీలో ఇదొక పద్ధతి. మనం భావోద్వేగాలకు లోనైనప్పుడు మెదడు కొత్త సమాచారాన్ని సరిగా గ్రహించలేదు, విడమరచుకోలేదు. నాడీవ్యవస్థ స్థిమితపడితే తప్ప ఇది తిరిగి కుదురుకోదు. చల్లటి నీటిలో ముఖాన్ని ముంచటం ద్వారా పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను ప్రేరేపితమై భావోద్వేగాలు తగ్గటానికి తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని